కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు( Mohan Babu ) ముద్దుల కూతురు మంచు లక్ష్మి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది.మొదట ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన ఈ తార తరువాత “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది.
ఆపై హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటిస్తూ అలరిస్తోంది.సినిమాల్లో బోల్డ్ గా నటించడమే కాక బయట కూడా ఈ తార బోల్డ్ గా మాట్లాడుతుంది.
ఒకానొక సందర్భంలో తన దగ్గర ఎంత జ్యువెలరీ ఉందో తనకే తెలియదని మంచు లక్ష్మీ ప్రసన్న( Lakshmi Manchu ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది.ఇదే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో ఫిమేల్ రిపోర్టర్ అడిగింది.
దానికి ఆమె చెప్పిన సమాధానం విని అందరూ మరింత ఆశ్చర్యపోయారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.“నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను.అదేంటంటే మా అమ్మ ఎన్నడూ కూడా జ్యువెలరీ కొనలేదు.
ఇప్పటికీ కూడా చాలా సన్నటి పుస్తెలతాడు ధరిస్తుంది.అంత సన్నటి పుస్తెలతాడు అసలు ఉంటుందా, అది ఎక్కడ దొరికిందో కూడా నాకు తెలియదు.
మా అమ్మకు నగలంటే అసలు నచ్చవు.వాటిపై ఆమెకు వ్యామోహమే ఉండదు.
ఇప్పుడిప్పుడే మేం పెద్దయ్యాక నల్లపూసల గొలుసులు వంటివి వేసుకుంటుంది కానీ ఆమెకు నగలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు.కానీ శారీలు మాత్రం విపరీతంగా కొనేస్తుంది, ఆమెకు అవిష్టం.” అని చెప్పుకొచ్చింది.
తనకి కూడా మొదట్లో నగలు అంటే ఇష్టం ఉండేది కాదని కానీ పాప పుట్టాక వాటి పైకి మనసు వెళ్లిందని తెలిపింది.అయితే అందరూ అనుకుంటున్నట్లు తన వద్ద పెద్ద జ్యువెలరీ కలెక్షన్ ఏమీ లేదని, తక్కువ కలెక్షన్ ఉన్నా అది చాలా గొప్ప కలెక్షన్ అని పేర్కొంది.సాధారణంగా ఆడవాళ్లకు డైమండ్ నెక్లెస్, బంగారు వడ్డాణాలు కొనుగోలు చేయాలని ఉంటుంది.
ఆస్తి ఉంటే వాటిని మగువలు కొనకుండా ఉండలేరు.కానీ మోహన్ బాబు భార్య నిర్మలాదేవి( Nirmala Devi ) మాత్రం వాటికి దూరంగా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ఇక కోట్ల ఆస్తి ఉన్నా మంచు విష్ణు, మంచు మనోజ్ బాబులు చాలా సింపుల్ గానే కనిపిస్తుంటారు.