అప్పుడప్పుడు సినీ సెలబ్రెటీలు కారణం లేకుండానే అజ్ఞాతంలోకి వెళ్లి పోతారు.ఎవరికి కనిపించకుండా ఒంటరిగా గడుపుతుంటారు.
కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించరు.అలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ కొన్ని రోజుల వరకు బయట ప్రపంచానికి, తమకు సంబంధం లేదు అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు.
అయితే తాజాగా హీరోయిన్ ఛార్మి( Charmi Kaur ) కూడా అజ్ఞాతంలోకి వెళ్లిందని తెలుస్తుంది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఛార్మి.తన నటనతో, అందంతో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఒకప్పుడు హీరోయిన్ గా నటించగా గత కొన్ని రోజులుగా ఆ స్థానాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం నిర్మాతగా ( Producer ) బాధ్యతలు చేపట్టింది.ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే హీరోయిన్ గా అడుగుపెట్టింది.
2001లో నీ తోడు కావాలి అనే సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించింది.కానీ ఈ సినిమా అంతా సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో నటించింది.ఈ సినిమాలో తన అందాలను కూడా ఆరబోసింది.ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది.ఆ తర్వాత మాస్, చక్రం, పౌర్ణమి, రాఖి, జ్యోతిలక్ష్మి, మంత్ర వంటి పలు సినిమాలలో నటించి మంచి హిట్ ను అందుకుంది.
ఇక జ్యోతిలక్ష్మి సినిమా( Jyotilakshmi ) తర్వాత సినిమాలకు దూరం అయింది.అది కూడా హీరోయిన్ గా మాత్రమే.జ్యోతిలక్ష్మి సినిమా సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannath ) తో పరిచయం ఏర్పడింది.ఇక ఆయన సహాయంతో నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.అలా పూరి జగన్నాథ్ రూపొందించే ప్రతి ఒక్క సినిమాలకు తానే నిర్మాతగా చేసేది.
గతంలో వీరిద్దరి సన్నిహితం చూసి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుసగుసలు కూడా వినిపించాయి.
కానీ వీరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని తామే స్వయంగా తెలిపారు.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది ఛార్మి.
ట్విట్టర్లో, ఇంస్టాగ్రామ్ లో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తమ సినిమాల అప్డేట్ల గురించి కూడా అందిస్తూ ఉంటుంది.
అయితే కొన్ని రోజుల నుండి ఛార్మి నుండి ఎటువంటి అప్డేట్ లేదు.ఎప్పుడైతే లైగర్ సినిమా డిజాస్టర్ అయిందో అప్పటినుంచి ఛార్మి సైలెంట్ అయ్యింది.ఈ సినిమా సమయంలో ఛార్మి బాగా లాస్ అయ్యింది.ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఛార్మి ఏ సినిమాకు కూడా ఒప్పుకున్నట్లు కనిపించడం లేదు.సోషల్ మీడియాలో కూడా ఎటువంటి అప్డేట్ లేదు.దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అని కొందరు అంటున్నారు.
ఇంత సైలెంట్ అయిపోయిన ఛార్మి ఇప్పుడు ఎక్కడ ఉంది.ఏం చేస్తుంది అని బాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.
మరి ఈ విషయం ఛార్మి చెవిన పడుతుందో లేదో చూడాలి.