ఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్.ఇందులో ఎప్పుడూ ఏదో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతునే ఉంటుంది అనే విషయం తెలిసిందే.
ఇక ఆలా వచ్చిన న్యూస్ లో ఏది నిజమైన వార్త అని తెలుసుకోవడం చాలా కష్టం. కరోనా వైరస్ నేపథ్యంలో ఇలాంటి వార్తలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి.
ఇలాంటి ఫేక్ న్యూస్ లకి అడ్డుకట్ట వేసేందుకు కొద్దిరోజుల కిందట వాట్సాప్ లో సరికొత్త విధానం తెర మీదికి తెచ్చింది.
దీని ప్రకారం ఏదైనా సందేశాన్ని ఒకసారి కేవలం ఐదుగురికి మాత్రమే షేర్ చేయగలిగేలా నిబంధన విధించింది వాట్సాప్.
దీంతో ఫేక్ న్యూస్ షేర్ చేయడం కొంత మేర తగ్గింది అంటూ వాట్సాప్ చెప్పుకొచ్చింది.కొత్త ఫీచర్ ద్వారా ఎక్కువ మందికి షేర్ కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది, సందేశం పక్కన బ్రౌజర్ అనే కొత్త ఫీచర్ యాడ్ చేసింది.
దీని ద్వారా వాట్సాప్ లోకి వచ్చిన సమాచారం నిజామా అబద్దమా అని గూగుల్లో వెతికి చూసుకోవచ్చు.ఫేక్ న్యూస్ ని పూర్తిగా నియంత్రించేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ నమ్ముతోంది.
ఈ క్రమంలోనే బ్రౌజర్ ఫీచర్ కొత్తగా పరిచయం చేసి వినియోగదారులను ఆకర్షించడంతో పాటు వినియోగదారులందరికీ రక్షణ కల్పించేందుకు వాట్సాప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.