అలీకి కాబోయే అల్లుడు ఏం చేస్తారు.. వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి సందడి నెలకొందని చెప్పాలి ఒక్కొక్కరుగా నటీనటులు వారి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడంతో సినీ తార లోకం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇలా ఒకరి వివాహం అయిన తర్వాత మరొకరు పెళ్లి చేసుకోవడంతో నిత్యం ఇండస్ట్రీలో పెళ్లి సందడి కనబడుతూనే ఉంది.

 What Will Alis Future Son In Law Do Do You Know Their Family Background, Ali Dau-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ కమెడియన్ కుమార్తె నిశ్చితార్థం జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఆగస్టు 25వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా తన కుమార్తె ఫాతిమా నిశ్చితార్ధాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు సినీ సెలెబ్రెటీరులు తరలి రావడంతో ఎంతో సందడి వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం అలీ కూతురు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎంతోమంది అభిమానులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా అల్లుడు గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.

అలీ తనకు కాబోయే అల్లుడు ఎవరు తానేం చేస్తాడు తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే అలీ మాత్రం తనకు కాబోయే అల్లుడికి సంబంధించిన విషయాలను చాలా రహస్యంగా ఉంచినట్టు తెలుస్తుంది.

Telugu Ali, Bramahanandam, Fatima, Sheikh Shahyaz, Zubida-Movie

ఇకపోతే అలీ కుమార్తె ఫాతిమా ఇప్పటికే డాక్టర్ కోర్స్ పూర్తి చేయడంతో అని తనకు కాబోయే అల్లుడు కూడా డాక్టర్ కావాలన్న ఉద్దేశంతోనే తన కూతురికి డాక్టర్ నిచ్చే పెళ్లి చేస్తున్నారని సమాచారం.అలీ కాబోయే అల్లుడు కూడా పెద్ద డాక్టర్ అని తెలుస్తోంది.ఇకపోతే అలీ అల్లుడు పేరు షేక్ షహయాజ్ తన ఫ్యామిలీ కూడా ఎంతో ఉన్నతమైన ఫ్యామిలీ అని వీరి ఇంట్లో చాలామంది డాక్టర్లు ఉన్నారని తెలుస్తోంది.ఇక ఈయనకు డాక్టర్ వృత్తితో పాటు సమాజ సేవ చేయడం అంటే కూడా ఎంతో ఇష్టమని అలీకి కాబోయే అల్లుడు గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలీ తన కూతురుకు తగ్గ వరుడిని తీసుకువచ్చారంటూ అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube