మణిరత్నం ( Mani Ratnam )డైరెక్షన్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి.కానీ గత ఏడాది వచ్చిన పొన్నియిన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్( Ponniin Selvan ).
విక్రమ్ , జయం రవి , కార్తి, ఐశ్వర్య రాయ్ త్రిష వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్ర మొదటి భాగం గతేడాది విడుదలైంది.తమిళుల నేపథ్యానికి చెందిన కథ కావడంతో కోలీవుడ్‌లో హిట్ తెచ్చుకున్న ఈ సినిమా మిగతా భాషల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.
అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్‌లో ఉండనుందని అప్పట్లోనే వార్తలు వినిపించాయి.
ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ ట్రైలర్‌ను విడుదల చేశారు .అనుకున్నట్లుగానే పాత్రల మధ్య అనేక ట్విస్టులతో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యింది.ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
అరుల్‌మొళి వర్మన్ చనిపోయాడని భావించి రాజ్యాన్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచనలో పాండ్యులు ఉంటారు .ఆదిత్య కరికాలుడుని కూడా చంపాలని ప్రణాళిక వేస్తారు.ఆ తర్వాత జరిగే ఊహించని మలుపుల నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ -2 సాగనున్నట్టు స్పష్టం అవుతున్నది .స్టన్నింగ్ విజువల్స్‌కు తోడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది.తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడే నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్( Aishwarya Rai ) నటన ఆకర్షించింది.అలాగే ఇతర పాత్రల నటన బాగుంది.
అంతక ముందు తొలి పార్టీ లో వంచన, ద్రోహం రాజ మందిరంలోకి చొచ్చుకుని పోతున్నాయి అనే విషయాన్నీ హైలైట్ చేశారు చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు కుటుంబంలో జరిగిన పరిణామాలని ఫస్ట్ పార్ట్ లో చూపించారు .పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడును యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు.ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను కోశాధికారి పళవేట్టురాయర్ ఏకం చేస్తాడు.సుందర చోళుడు( Sundara Chola ) అన్నయ్య కుమారుడు మధురాంతకుడు ను రాజును చేయాలనేది అతని కోరిక.
రాజ్య ఆక్రమణ కోసం తెలిసినవాళ్లే కుట్ర చేస్తున్నారని గ్రహించి.ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్‌ని ఆదిత్య కరికాలన్ రంగంలోకి దింపుతాడు .సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై ఎలా చెక్ పెట్టింది.పళవేట్టురాయల్ భార్య నందిని ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు చెప్పడం ఫస్ట్ పార్ట్ లో హైలైట్ అయ్యాయి .ఇక సెకండ్ పార్ట్ లో అరుల్‌మొళి వర్మన్ చనిపోయాడని భావించిన పరినామాలని .ఆ తర్వాత జరిగే మలుపులు ప్రధానంగా రూపొందించినట్టు స్పష్టం అవుతుంది .