గెలవమని తెలిసినా అభిశంసన...డెమోక్రటిక్ పార్టీ వ్యూహం ఏమిటి..????

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మాన విషయం గురంచి అందరికి తెలిసిందే.రెండు ప్రధాన అంశాలని ఆధారంగా చేసుకుని ట్రంప్ పై అభిశంసన పెట్టారు డెమోక్రటిక్ పార్టీ నేతలు.

 What Is Democratic Party Plan-TeluguStop.com

ముందు ప్రతినిధుల సభలో ఈ అభిశంసన ఆమోదం పొంది తరువాత సెనేట్ కి చేరింది.అయితే లో ఈ అభిశంసన ఆమోదం పొందలేదు.

ఈ విషయం చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు, డెమోక్రటిక్ పార్టీ వారికి తెలియదా అనే సందేహాలు రావచ్చు.గెలవమని తెలిసినా సరే డెమోక్రాట్లు అభిశంసన ఎందుకు పెట్టినట్టు.???
ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుంచీ నేటి వరకూ పరిస్థితులని చూస్తే మొదట్లో ట్రంప్ పై ఉన్న నమ్మకం మెల్లమెల్లగా సన్నగిల్లుతూ వచ్చింది.అమెరికా ప్రజలకి ఇచ్చిన హామీలలో సగానికి సగం నెరవేరక పోగా, ట్రంప్ తనకి ఉన్న అధికారాలని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారనే అభిప్రాయం ప్రజలలో బలంగా ఉంది.ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనుండటంతో ట్రంప్ ప్రభుత్వ వైఖరిని అమెరికా ప్రజలకి తెలియచేయాలని అనుకున్నారు డెమోక్రటిక్ పార్టీ నేతలు…

Telugu Democratic, Donald Trump, Trail, Telugu Nri-

ట్రంప్ హాయంలో బయటకి నెట్టివేయబడిన అమెరికా మాజీ బద్రతా సలహాదారు జాన్ , ట్రంప్ అధికార దుర్వినియోగం పై ఎంతో అత్యంత కీలకమైన సమాచారం బయటపెట్టడంతో పాటు అందుకు కీలక ఆధారాలు ప్రతినిధుల సభలో ఉంచడం డెమోక్రాట్లు, కీలకమైన ఒబామా, హిల్లరీ వంటి ప్రజా నేతలు అందరూ ట్రంప్ ఆగడాలపై ప్రజలలో అవగాహన కల్పించడంతో రిపబ్లికన్ పార్టీ పై తీవ్రమైన వ్యతిరేకత ప్రజలలో కలిగేలా చేశారు.అంతేకాదు ట్రంప్ పై అభిశంసన గెలిచినా గెలవక పోయినా ప్రజల ముందు ట్రంప్ ని నిలబెట్టాలని అనుకున్నారు నిలబెట్టారు.ఎందుకంటే.
ఎలాగో ట్రంప్ కి ఉన్న బలంతో సెనేట్ లో నెగ్గుకొస్తాడు కానీ ఆ గెలుపు కేవలం తన మద్దతుదారుల వలన వచ్చిందే తప్ప ట్రంప్ చేసిన తప్పులని కప్పి పుచ్చదు.

ట్రంప్ పై వసున్న లైంఘిక విమర్శలు, అధికార దుర్వినియోగ ఆరోపణలు, వలస వాసులపై తీసుకుంటున్న కటినమైన నిర్ణయాలు, వీసా జారీల విషయంలో వివిధ దేశాల ఎన్నారైల నుంచీ ఎదుర్కుంటున్న అసంతృప్తి, యుద్ద పిపాశిగా మారిన ట్రంప్ పై ప్రజలలో ఇప్పటికే అసంతృప్తి పేరుకుపోయింది.ఈ క్రమంలో ట్రంప్ అభిశంసన నెగ్గినా రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా కోర్టులో ట్రంప్ అభిశంశించ బడుతాడు అంటున్నారు నిపుణులు.

డెమోక్రటిక్ పార్టీ కూడా ఈ అంచనాలతోనే ముందుకు వెళ్తోందని వారి ఆలోచనలని సరిగ్గా అమలు చేస్తున్నారని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube