తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో నవదీప్( Navdeep ) ఒకడు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి.
ఇక ఈయన అంటే అప్పట్లో అమ్మాయిలు బాగా ఇష్టపడే వారు ఇక రీసెంట్ గా ఆయన ఒక డ్రగ్స్ కేసు లో ఇరుక్కున్నారు.ఆయన ఇలా డ్రగ్స్ కేసు ల్లో ఇరుక్కోవడం కొత్తేమి కాదు,హైద్రాబాద్( Hyderabad ) లో ఎక్కడ డ్రగ్స్ టాపిక్ వచ్చిన ఆయన పేరు తప్పకుండ వినిపిస్తుంది.
అయితే ప్రస్తుతం ఆయన అభిమానులు మాత్రం మంచి మార్కెట్ ఉన్న నవదీప్ మంచి సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ లో మంచి హీరో గా కొనసాగక ఎందుకు ఆయన ఎప్పుడు ఈ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటాడు అని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు.
నిజానికి ఈయనకి అప్పట్లో చాలా సినిమాల్లో హీరో గా హీరో గా మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఈయనకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ సినిమాలను వదులుకున్నాడు.ఇక ఈయన చేసిన సినిమాలు ఈ మధ్య వరుసగా ప్లాప్ అవ్వడం తో ఈయన మార్కెట్ బాగా డౌన్ అయింది.ఇక దాంతో వేరే హీరోల సినిమాల్లో కొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నాడు…
నిజానికి నవదీప్ సినిమాల్లో చేస్తే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి అవకాశాలు వస్తాయి.కానీ ఆయన సినిమా ఒప్పుకున్నా కూడా షూటింగ్స్ కి రావడం డిలే చేస్తాడు అనే టాక్ అయితే ఉంది.ఇక దాంతో ఆయనని ఎవరు సినిమాల్లోకి తీసుకోవడం లేదు అనే టాక్ కూడా ఉంది.
ఇక ప్రస్తుతం ఈయన కేసులు గొడవలు అంటూ తిరుగుతున్నాడు.మంచి సినీ కెరియర్ ని వదులుకొని అలా ఎందుకు చేస్తున్నాడో ఎవ్వరికి అర్థం కావడం లేదు…
.