నిన్ను ఎప్పుడూ మర్చిపోలేము.. చెల్లెలి మరణం పై ఎమోషనల్ పోస్ట్ చేసిన సిమ్రాన్!

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు చాలా చిన్న వయసులోనే చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు.అయితే వారు చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కొందరికి ప్రేమ వ్యవహారాలు కారణమైతే మరికొందరికి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ మరణించిన వారు ఉన్నారు.

 We Will Never Forget You Simrans Emotional Post On Sisters Death , Monal, Simran-TeluguStop.com

ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు చిన్నవయసులోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి.ఇలా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారిలో సీనియర్ నటి సిమ్రాన్ ( Simran )చెల్లెలు మోనాల్ ఒకరు.2000వ సంవత్సరంలో తన 18వ యేట ఇంద్రధనుష్ అనే ఓ కన్నడ సినిమా ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయమయ్యారు సిమ్రాన్ చెల్లెలు మోనాల్(monal).

ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ఈమె పలు సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.అదే సమయంలోనే కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడిన మోనాల్ తన ప్రేమ విఫలం కావడంతో 2002 ఏప్రిల్ 14వ తేదీ తన గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.అయితే ఈమె చనిపోయి 20 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈమె మరణానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియలేదు.

అయితే చెల్లెలు మరణాన్ని గుర్తు చేసుకున్నటువంటి నటి సిమ్రాన్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే సిమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో తన చెల్లెలితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… మా అందమైన చెల్లెలు మోనాల్ ప్రేమకు గుర్తుగా… నిన్ను ఎప్పుడు మర్చిపోలేము అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం సిమ్రాన్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సిమ్రాన్ సినీ కెరియర్ గురించి మనకు తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె అప్పట్లో స్టార్ హీరోలు సరసన నటించిన ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube