Amma Nanna O Tamila Ammayi: అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదా..ఆ హీరో ఎవరంటే..?

పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్ సినిమా తర్వాత మరో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ సినిమాలో రవితేజ హీరోగా అసిన్ హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ జయసుధ రవితేజ అమ్మానాన్నలుగా చేశారు.బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తల్లి ప్రేమ, తండ్రి ఎమోషన్, లవ్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి.

 Wasnt Ravi Teja The First Choice For Amma Nanna O Tamila Ammayi Movie Who Is Th-TeluguStop.com

అయితే ఇడియట్ ( Idiot ) సినిమా తర్వాత మళ్లీ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో రవితేజ పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్ సినిమాని తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా రవితేజ కెరియర్ కి మరింత బూస్ట్ ఇచ్చినట్లు అయింది.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి మొదట ఛాయిస్ రవితేజ ( Raviteja ) మాత్రం కాదట.పూరి జగన్నాథ్ మొదట్లో ఈ సినిమాకి వేరే హీరోని తీసుకోవాలని భావించారట.

ఇక ఆ హీరో ఎవరో కాదు శ్రీరామ్.తమిళంలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్.

కానీ ఈయన అటు శ్రీకాంత్ ఇటు శ్రీరామ్ ( Sriram ) రెండు పేర్లతో పిలవబడతాడు.ఇక ఈయన తెలుగు హీరో అయినప్పటికీ తమిళంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

Telugu Ammananna, Asin, Idiot, Jayasudha, Manirathnam, Prakash Raj, Puri Jaganna

ఒకరికి ఒకరు అనే సినిమాతో మొదటిసారి తెలుగు సినిమా చేశారు.ఇక అంతకుముందు ఈయన నటించిన తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి.ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్ మాట్లాడుతూ.నేను గాయాల పాలవ్వడం వల్ల అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ( Amma Nanna O Tamila Ammayi movie ) లో ఛాన్స్ మిస్ చేసుకున్నాను.

ఈ సినిమానే కాదు ఇంకా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలను నేను మిస్ అవాల్సి వచ్చింది.అయితే అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి ముందుగా నేను సైన్ చేశాను.

Telugu Ammananna, Asin, Idiot, Jayasudha, Manirathnam, Prakash Raj, Puri Jaganna

ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.అయినప్పటికీ నాకు స్కిన్ అంటించి యాక్షన్ సీన్స్ కొన్ని తగ్గించి సినిమా తెరకెక్కిద్దాం అనుకున్నారు.కానీ ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలే హైలైట్ గా నిలుస్తాయి.అలాంటప్పుడు ఈ పాత్రకి అన్యాయం చేయడం నాకు నచ్చలేదు.ఈ పాత్రకి 100% న్యాయం చేయలేను అనే ఉద్దేశంతోనే నేను ఈ సినిమాని రిజెక్ట్ చేశాను.ఆ తర్వాత రవితేజ ( Raviteja ) సినిమా చేశారు.

ఇక రవితేజ నాతో వెండిని తట్టలో పెట్టి నాకు అందించారు నేను దానిని లపుక్కున మింగేసాను అంటూ చెప్పారు.ఇక గాయాల నుండి కోలుకొని హాస్పిటల్ నుండి బయటికి వచ్చాక తెలుగులో మెయిన్ హీరోగా ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు.

అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో కొన్ని మెయిన్ లీడ్ ఉన్న పాత్రల్లో చేస్తున్నాను.తమిళంలో మాత్రం హీరోగా కొనసాగుతున్నాను అంటూ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube