Amma Nanna O Tamila Ammayi: అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదా..ఆ హీరో ఎవరంటే..?
TeluguStop.com
పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్ సినిమా తర్వాత మరో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ సినిమాలో రవితేజ హీరోగా అసిన్ హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ జయసుధ రవితేజ అమ్మానాన్నలుగా చేశారు.
బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తల్లి ప్రేమ, తండ్రి ఎమోషన్, లవ్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి.
అయితే ఇడియట్ ( Idiot ) సినిమా తర్వాత మళ్లీ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో రవితేజ పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్ సినిమాని తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమా రవితేజ కెరియర్ కి మరింత బూస్ట్ ఇచ్చినట్లు అయింది.అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి మొదట ఛాయిస్ రవితేజ ( Raviteja ) మాత్రం కాదట.
పూరి జగన్నాథ్ మొదట్లో ఈ సినిమాకి వేరే హీరోని తీసుకోవాలని భావించారట.ఇక ఆ హీరో ఎవరో కాదు శ్రీరామ్.
తమిళంలో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్.
కానీ ఈయన అటు శ్రీకాంత్ ఇటు శ్రీరామ్ ( Sriram ) రెండు పేర్లతో పిలవబడతాడు.
ఇక ఈయన తెలుగు హీరో అయినప్పటికీ తమిళంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. """/" /
ఒకరికి ఒకరు అనే సినిమాతో మొదటిసారి తెలుగు సినిమా చేశారు.
ఇక అంతకుముందు ఈయన నటించిన తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి.ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్ మాట్లాడుతూ.
నేను గాయాల పాలవ్వడం వల్ల అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ( Amma Nanna O Tamila Ammayi Movie ) లో ఛాన్స్ మిస్ చేసుకున్నాను.
ఈ సినిమానే కాదు ఇంకా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలను నేను మిస్ అవాల్సి వచ్చింది.
అయితే అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి ముందుగా నేను సైన్ చేశాను.
"""/" / ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.అయినప్పటికీ నాకు స్కిన్ అంటించి యాక్షన్ సీన్స్ కొన్ని తగ్గించి సినిమా తెరకెక్కిద్దాం అనుకున్నారు.
కానీ ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలే హైలైట్ గా నిలుస్తాయి.అలాంటప్పుడు ఈ పాత్రకి అన్యాయం చేయడం నాకు నచ్చలేదు.
ఈ పాత్రకి 100% న్యాయం చేయలేను అనే ఉద్దేశంతోనే నేను ఈ సినిమాని రిజెక్ట్ చేశాను.
ఆ తర్వాత రవితేజ ( Raviteja ) సినిమా చేశారు.ఇక రవితేజ నాతో వెండిని తట్టలో పెట్టి నాకు అందించారు నేను దానిని లపుక్కున మింగేసాను అంటూ చెప్పారు.
ఇక గాయాల నుండి కోలుకొని హాస్పిటల్ నుండి బయటికి వచ్చాక తెలుగులో మెయిన్ హీరోగా ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు.
అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో కొన్ని మెయిన్ లీడ్ ఉన్న పాత్రల్లో చేస్తున్నాను.
తమిళంలో మాత్రం హీరోగా కొనసాగుతున్నాను అంటూ శ్రీరామ్ చెప్పుకొచ్చారు.
అతనే నా ఫస్ట్ క్రష్….మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!