తక్కువ ధరలలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు కొనాలని అనుకుంటున్నారా? ఇవి చూడండి!

కారు ఎవరికవసరం లేదు.ఈ మధ్య కాలంలో దాదాపుగా అందరూ సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాలు వారి వారి ఫ్యామిలీతో చేసుకొనుటకు ప్రియారిటీ చూపిస్తున్నారు.

 Want To Buy Best Mileage Cars At Low Prices Check These Out , Best Mileage Cars,-TeluguStop.com

ఈ క్రమంలోనే కార్లవైపు మొగ్గు చూపుతున్నారు.ఏమాత్రం ఆదాయం వున్నవారు కూడా కార్లను లోను రూపంలో కొనేసుకుంటున్నారు.

ఇక దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో చాలా మంది ప్రజలు మరింత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నారు.కాబట్టి ఇపుడు మనం ఇక్కడ ధర రూ.10 లక్షల లోపు ఉండి, మంచి మైలేజీని కూడా అందించే కారులను ఓసారి పరిశీలిద్దాము.

ఇక్కడ మొదటగా “మారుతి సుజుకి వ్యాగన్ఆర్”( Maruti Suzuki WagonR ) గురించి మాట్లాడుకోవాలి.ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి.దీని మైలేజీనే దీనికి ప్లస్.ఈ కారులో 1.0 లీటర్, 1.2 లీటర్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అనేవి ఉన్నాయి.కంపెనీ తెలుపుతున్న ప్రకారం ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్తో లీటరుకు 24.35 కిలోమీటర్లు మైలేజ్ పొందుతుంది.ఈ లిస్టులో రెండవది “మారుతీ సుజుకి బలెనో సీఎన్జీ( Maruti Suzuki Baleno CNG ).” ఇది గత ఏడాది విడుదల అయింది.ఇది 30.61 కిలోమీటర్ల మేర మైలేజీని ఇవ్వగలదు.

ఇక మూడవ కారు “మారుతీ సుజుకి సెలెరియో.”( Maruti Suzuki Celerio ) ఇది లీటరుకు 26.68 కిలోమీటర్ల మేర మైలేజీని ఇస్తుంది.ఇక దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఈ లిస్టులో నాల్గవది “టాటా టియాగో సీఎన్జీ.” ( Tata Tiago CNG )ఇది 26.49 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.44 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఈ లిస్టులో ఐదవ కారు “హ్యుందాయ్ ఆరా” ఇది పెట్రోల్, రెండు సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో కలదు.ఆరా సీఎన్జీ 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.10 లక్షల నుంచి రూ.8.87 లక్షల మధ్యలో ఉంది.ఇక్కడ లిస్టులో ఇవ్వబడ్డ ఏ కారన్నా మైలేజ్ విషయంలో సూపర్ అని అనుభవజ్ఞులే చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube