బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ(Vishnu Priya) ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు.అయితే ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలలోనూ స్పెషల్ అకేషన్ సమయంలోను ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.తాజాగా విష్ణు ప్రియ తన తల్లిని కోల్పోయిన విషయం మనకు తెలిసిందే.
ఇలా తల్లి మరణంతో ఈమె ఒంటరి అయ్యారు.ఈ విధంగా తన తల్లి మరణించడంతో విష్ణు ప్రియ తన తండ్రి ( Vishnu Priya Father ) వద్దకు వెళ్లారు.
తాజాగా తన తండ్రితో కలిసి ఈమె జీ తెలుగులో ప్రసారమైన నేను నాన్న(Nenu Naanna) అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ తన తండ్రి గురించి పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ తాను మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయారని తెలిపారు.ఇలా అమ్మ నాన్నలు వేరు కావడంతో తాను అమ్మ వద్దే పెరిగానని నాన్న మరో పెళ్లి చేసుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం అమ్మ మరణించడంతో తిరిగి నేను నాన్న ప్రేమను పొందడం కోసం నాన్న వద్దకు వెళ్లానని చెప్పారు.ఇక నాన్న ప్రేమను ఆస్వాదించని వారు ఎవరుంటారు.అయితే నేను ఆ ప్రేమను చాలా ఆలస్యంగా పొందుతున్నానని తెలిపారు.అమ్మ నాన్నలు విడిపోయినప్పుడు నేను చాలా తిట్టుకున్నాను.వీరి వల్ల తాను ఎంతో మంచి లైఫ్ మిస్ అయ్యానని అనుకున్నాను కానీ నాలాగే మీరు కూడా ఎవరైనా అనుకుంటూ ఉంటే వారిని ద్వేషించవద్దు.అలా వారిద్దరూ విడిపోవడానికి గల కారణాల గురించి ఆలోచించాలని తెలిపారు.
అమ్మ నాన్నలు విడిపోవడంతో నాన్న మరో పెళ్లి చేసుకున్నారు.నాకు ఇప్పుడు ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు.
అంటూ ఈ సందర్భంగా తన తండ్రి గురించి చెబుతూ విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యారు.