ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తన భవిష్యత్తుకు ఢోకా లేకుండా కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు.ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.బిజెపి ఫ్లోర్ లీడర్ గా కొంత కాలం పనిచేసిన ఆయన వచ్చే ఎన్నికల కోసం ఆయన చేస్తున్న గ్రౌండ్ వర్క్ పైనే అందరి దృష్టి పడింది.
విష్ణుకుమార్ రాజు చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఇదే :
ఉత్తరాదిన బిజెపికి అంతో ఇంతో పెద్దదిక్కుగా విష్ణుకుమార్ రాజు ఉంటున్నాడు.ఏ ఎన్నికలు జరిగినా తన ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండే విధంగా చూసుకుంటున్నాడు.ఏపీలో వైఎస్ఆర్సిపి గాలి వీస్తున్నప్పటికి జీవీఎంసీ ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ ని గెలిపించుకొని తన సత్తా చాటుకున్నాడు.2019 ఎన్నికల్లో బిజెపి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు దీంతో బిజెపి నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిట్లు గల్లంతు అయిన పరిస్థితి.ఇదే తరుణంలో విష్ణుకుమార్ రాజు వైజాగ్ లో 20 వేల దాకా ఓట్లు రాబట్టుకున్నాడు ఇది ఆయన సొంత క్యాడర్.
ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని గ్రౌండ్ వర్క్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట.వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ,జనసేన తో పొత్తు ఉంటాయన్న నమ్మకం తో టిడిపి జనసేన నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు విష్ణుకుమార్ రాజు.
ఒకవైపు వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడుని పొగుడుతూ, మరోవైపు జనసేన నాయకులను చేరదీసి ఆదరిస్తున్నారు.
పొత్తులో భాగంగా ఆ సీటు వేరే పార్టీకి వెళ్లకుండా అందరూ ఆయనకే సహకరించేలాగా ప్లాన్ వేస్తున్నాడు విష్ణుకుమార్ రాజు.ఉత్తరాదిన టిడిపి జనసేన కు మంచి బలం ఉన్నప్పటికీ సరైన లీడర్ లేకపోవడంతో ఆ లోటును విష్ణుకుమార్ రాజు భర్తీ చేయాలని చూస్తున్నాడు.పొత్తులో భాగంగా తన సీటుకు డోకా లేకుండా ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నాడు.
అందుకే గత కొంతకాలంగా చంద్రబాబు పాలన భేష్ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యల చూస్తున్నాడు విష్ణుకుమార్ రాజు.అయితే సొంత పార్టీ నేతలు మాత్రం ఇదేంటి రాజుగారు అన్నట్లు చర్చించుకుంటున్నారు.
బిజెపి కేంద్ర నాయకత్వం విష్ణు కు అండగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన సీటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న చర్చ కూడా సాగుతోంది.వైసిపికి ఉన్న వ్యతిరేకతతో ఈసారి ఎమ్మెల్యే మా రాజుగారే అంటూ తన అనుచరులు తూర్పులో హంగామా చేస్తున్నారట.