సమాజంలో ఆడవారికి భద్రత కరువైంది.ఆడవారు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి.
దేశవ్యాప్తంగా నిత్యం ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.అత్యాచార కేసులు రోజులో పదుల సంఖ్యలో నమోదు అవుతున్న కూడా ప్రభుత్వం అటువంటి వారిపై కఠినంగా శిక్షలు అమలు చేయకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు.
అయితే సమాజంలో కేవలం సామాన్యులకే కాకుండా సెలబ్రిటీలకు సైతం భద్రత కరువైంది అని చెప్పవచ్చు.తాజాగా ఒక బుల్లితెర నటి కీ కూడా అలాంటి చేదు అనుభవం ఎదురయింది.
బుల్లితెర పై ప్రసారమవుతున్న వల్లి తిరుమనం, యారది నీ మోహిని వంటి సీరియల్స్ లో నటించి నటిగా మంచు గుర్తింపు ఏర్పరచుకున్న మలయాల నటి నక్షత్ర తాజాగా తనతో ఒక బస్సు డ్రైవర్ నీచంగా ప్రవర్తించాడు అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.ఇటీవల నక్షత్ర సోదరి చెన్నై నుంచి కేరళలోని తమ స్వస్థలం అలువా వెళ్లడానికి ఓ ప్రైవేటు బస్సు ఎక్కిందట.
ఆ తరువాత అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు బస్సులో ఉన్న రెండో డ్రైవర్ ఆమెను అసభ్యకరంగా తాకాడట.అప్పుడు వెంటనే తేరుకున్న నక్షత్ర అతనిని ఏం చేస్తున్నావు అంటూ నిలదీయడంతో ఏమీ లేదు పొరపాటున చేయి తగిలింది అంటూ సదరు బస్సు డ్రైవర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడట.
అప్పుడు బస్సులో తోటి ప్రయాణికులు ఏం జరిగింది అని అనడంతో ఆమె జరిగింది మొత్తం వివరించగా అక్కడ కొంత ప్రయాణికులు కూడా మాతో కూడా అలాగే ప్రవర్తించాలని ఆరోపించారట.ఇది తన చెల్లిని లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తి ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది నక్షత్ర.వెంటనే ఆ బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్,కేరళ సీఎం వినరా విజయన్ లను ట్యాగ్ చేసింది.