వైరల్: హఠాత్తుగా స్కూటీకి నిప్పు అంటుకోవడంతో ఏం చేసారంటే?

ఈమధ్య కాలంలో వాహనాలు భగ్గుమంటున్నాయి.అదేనండి, ఎన్నో వేలు, లక్షలు పెట్టి కొనుక్కున్న వాహనాలు కళ్ళముందే కాలిపోతుంటే వాహదారుల బాధలు చూడాలి.

 Viral What Did You Do When Scooty Caught Fire Suddenly , Scotty, Fire, Viral Lat-TeluguStop.com

అదే వాహనాలు వారు ప్రయాణిస్తున్న రోడ్డుపైన హఠాత్తుగా కాలిపోతే ఆ బాధ వర్ణనాతీతం.సమయానికి అక్కడ ఎవరన్నా ఉంటే పర్వాలేదు… లేదంటే పెద్ద ప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు.

తాజాగా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోను “సుశాంత నందా” అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వెలుగు చూసింది.

కాగా దీనిని చూసినవారు అవాక్కవుతున్నారు.ఇక వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే గనుక, ఒకవ్యక్తి తన భార్యతో రోడ్డుపైన ఒక స్కూటీతో ప్రయాణిస్తున్నాడు.ఇంతలో హఠాత్తుగా అతని భార్యకు ఏదో అనుమానం కలిగింది.ఆ విషయాన్ని తన భర్తతో చెప్పగా అతను తన బండిని ఆపి కింద మీద పరిశీలించాడు.

అనూహ్య సంఘటన… ఆ స్కూటీ కింద భాగం భగ్గుమని కాలిపోవడాన్ని ఇద్దరు చూసి ఆ బండికి అక్కడే ఉన్నపళంగా ఉంచేసి పక్కకి వచ్చేసారు.

ఈ తంతుని అక్కడ స్థానికులు గమనించి బైకుపై నీళ్లు చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు.

ఆ తర్వాతో మరో ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చి నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు.అయినా ఫలితం కనబడకపోవడంతో వేరే వ్యక్తి మంటలు ఆర్పే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెచ్చి పూర్తిగా బైక్‌పై స్ప్రే చేసాడు.

దాంతో మంటలు అదుపులోకి వచ్చాయి.దాంతో ఆ దంపతులు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు రకరాలుగా కామెంట్లు పెడుతున్నారు.‘సమయానికి జనాలు పక్కనే వున్నారు గనుక సరిపోయింది, లేదంటే వారి ప్రాణాలకే ప్రమాదం వచ్చును’ అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube