కేరళ నరబలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ధనవంతులు కావాలన్న అత్యాశతో ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నరబలి ఇచ్చిన తర్వాత భగవాల్ సింగ్ దంపతులు ఆ మాంసం వండుకొని తిన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.బలి ఇచ్చిన మాంసాన్ని తింటే యవ్వనంగా ఉంటారని మాంత్రికుడు షఫీ చెప్పిన మాటలను విన్న దంపతులు.
ఆయన చెప్పినట్లే చేశారు.పోలీసు విచారణలో భగవాల్ సింగ్ దంపతులు ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ధనవంతులు అవ్వాలన్న అత్యాశతో క్షుద్ర పూజలు చేసిన భగవాల్ సింగ్ దంపతులు.మాంత్రికుడు షఫీ మాయలో పడ్డారు.
ఈ క్రమంలో జూన్ 6న రోజీ అనే మహిళను కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చిన నిందితులు.సెప్టెంబర్ 26న పద్మం అనే మహిళను నరబలి ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
అంతేకాకుండా నిందితుడు షఫీపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ క్రమంలో న్యాయస్థానం నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.







