వైరల్ వీడియో: అచ్చం మనిషిలా ఆ కోతి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..!

కోతుల నుంచే మనిషి రూపాంతరం చెందాడని మనం చాలా పుస్తకాల్లో చదివాం.సైన్స్ కూడా అదే చెబుతోంది.

 Viral Video Monkey Washing Clothes Similar To Human Beings , Viral Video, Viral-TeluguStop.com

కోతులకు, మనుషులకు దగ్గరి లక్షణాలు ఉన్నాయి.కోతుల శరీర అవయవ నిర్మాణం మనుషుల శరీర నిర్మాణానికి దగ్గరగా ఉంటుంది.

అందుకే ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధిత పరీక్షలను మొదటగా కోతులపై చేస్తుంటారు.కోతులపై పరీక్షలు సక్సెస్ అయితే తరువాత మనుషులపై ప్రయోగిస్తారు.

కోతులను సర్కస్ లో, సినిమాల్లో కూడా ఉపయోగిస్తారు.ట్రైనింగ్ ఇస్తే కోతులు మనుషులు చేసే పనులు కూడా చేస్తాయి.మనం దేశంలో ఏ పుణ్యక్షేత్రంలో చూసినా కోతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఇక ప్రస్తుతం అడువుల శాతం తగ్గిపోవడంతో కోతులు ఊళ్లలోకి వచ్చి ఇళ్లల్లో ఉండే ఆహారాన్ని ఎత్తుకెళ్తున్నాయి.

ఇళ్లల్లోకి దూరి ఏవి దొరికితే వాటినే పట్టుకెళ్తాయి.కానీ ఈ వీడియోలో ఉన్నకోతి విచిత్రంగా బట్టలు ఉతుకుతోంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కోతి ఒక వస్త్రాన్ని బ్రష్ ను ఉపయోగిస్తూ ఉతుకుతుంది.

అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోకు రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube