వైరల్ వీడియో: తాబేలును తినడానికి ప్రయత్నించిన మొసలి.. కాకపోతే..?!

మొస‌లి నోటికి చిక్కితే.ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.

 Viral Video Crocodile Trying To Eat A Turtle If Not, Crocodile, Tries ,eat, Tu-TeluguStop.com

వాస్తవానికి ఒక భారీ మొస‌లి తన 60-110 పళ్ళ కింద 1,700-4000 కేజీల ఒత్తిడిని సృష్టించగలదు.ఆ స్థాయి ఒత్తిడికి బొక్కలు కూడా విరిగిపోయి పిండిలా మారటం ఖాయం.

అతి భయంకరమైన దవడల శక్తి తో మొసళ్లు రెప్పపాటు వేగంతో తన ప్రత్యర్థులను క్షణాల్లో చంపగలవు.సింహాలు, పులులు కూడా తప్పని పరిస్థితుల్లో తప్ప మొసళ్ల జోలికి వెళ్లవు.

ఇప్పటికే ఎన్నో సింహాలను, పులులను మొసళ్లు చంపినట్టుగా వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

అయితే అడవికి రాజు అయిన సింహలను సైతం మట్టుబెట్టిన మొసళ్లు చిన్న జీవులను చంపడంలో మాత్రం విఫలమై అరణ్యములో అభాసుపాలు అవుతాయి.

తాజాగా ఓ విస్తీర్ణ అరణ్యం లో ఇలాంటి ఘటన మరొకటి జరగగా.దానికి సంబంధించిన వీడియో అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యింది.కాగా, ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

ఆఫ్రికన్ యానిమ‌ల్స్ అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేసిన ఈ మొసలి-తాబేలు వీడియోలో.

మొసలి నోటికి చిక్కిన ఒక తాబేలును మనం చూడొచ్చు.ఈ వీడియోలో మొసలి తన పదునైన పళ్ళతో తాబేలు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి వేసి ఆబగా ఆరగించాలని విశ్వ ప్రయత్నం చేసింది.

కానీ తాబేలుకు దృఢమైన రక్షక కవచం ఉండటంతో మొసలి మింగలేక.గట్టిగా కొరక లేక ఘోరంగా విఫలమైంది.

తాబేలు చర్మం పై ఉన్న పెంకు చాలా నున్నగా ఉండటం తో.మొసలి నోటికి చిక్కినట్టే చిక్కి తాబేలు జారి పడిపోయింది.దీంతో మొసలి మళ్లీ తాబేలును నోటిలో కరచుకొని కరకరా నమిలి మింగిన డానికి ప్రయత్నించింది కానీ మళ్లీ తాబేలు జారి కింద పడిపోయింది.దీంతో చిర్రెత్తుకొచ్చిన మొసలి తాబేలుపై దాడి చేయడానికి తిరిగి ప్రయత్నించలేదు.

దీంతో తాబేలు సమీపంలోని నీటి కొలనులోకి వడివడిగా వెళ్ళిపోయింది.ఫలితంగా తాబేలు వంటి చిన్న జీవిని చంపే ప్రయత్నం చేసి మొసలి నవ్వుల పాలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube