వైరల్ వీడియో: పానీపూరి లను లొట్టలేసుకుంటూ ఆరగిస్తున్న ఆవుదూడలు..!

చాలా మందికి పానీపూరి అంటే చాలా ఇష్టం.అది తినాలని ఉవ్విళ్లూరుతుంటారు.

 Viral Video: Cow Calves Melting Panipuris Man, Feedingm Golgappasm , Cow, Calf,-TeluguStop.com

యువత ఎక్కువ మంది పానీపూరి తినడం అలవాటు చేసుకుంటారు. లాక్ డౌన్ కు ముందు సాయంత్రం అయితే చాలు ప్రతి రోడ్డుపై పానీపూరి బండి ఉంటుంది.

ఆ బండి చుట్టూ గుంపు గుంపులుగా ఫ్రెండ్స్, బంధువులు, టీచర్లు, ఇలా చాలా మంది గుమికూడి పానీపూరి తినేస్తుంటారు.వారు తినడమే కాదు ఇంటికి కూడా తీసుకెల్లి ఇస్తుంటారు.

ఇది ఆ రోజుల్లో సహజంగా జరిగే విషయం.అయితే దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

దీనివల్ల వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు పాటిస్తున్నాయి.దీంతో చాలా మంది పానీపూరి తినడానికి దూరమయ్యారు.

అయితే ఇప్పుడు పానీ పూరి విషయం ఎందుకు చెబుతున్నాను అంటే తాజా పారీపూరిని జంతువులు తింటున్న ఘటన చోటుచేసుకుంది.సాధారణంగా ఆవు గడ్డి తింటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.

ఆవులు కొన్ని సందర్బాల్లో రోటీ లేదా ఆకుపచ్చ కూరగాయలు తినడం అందరికీ తెలిసిందే.అయితే ఈ వీడియోలో ఓ ఆవు, దూడ పానీపూరి తింటూ తెగ ఎంజాయ్ చేశాయి.

ఆవు యజమాని ఎంతో ఓపికగా ఆవుకు, దాని దూడకు పానీ పూరి తినిపిస్తున్నారు.చూడముచ్చటగా ఉన్న ఈ దృశ్యం స్థానికులతో పాటు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ చాలా ఇష్టపడుతూ రకారకాల కామెంట్స్ పెడుతున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోను నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 58వేల మంది వీక్షించారు.సాధారణంగా జంతువులు, పక్షులు ఇలా పానీపూరి తినడం ఎక్కడా చూసుండరు.

కొంతమంది తమ జంతువులను తమ బిడ్డలులాగా చూస్తుంటారు.పశువులు మేపేవారు తమ ఆవులను, దూడలను తమ సొంత కుటుంబీకులులాగా చూసుకుంటారు.

ఇది పల్లెటూరిలో ప్రతి ఇంటిలో జరిగే విషయమే.అయితే ఇక్కడ జంతువులకు పానీపూరి తినిపిస్తున్న సంగతి ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఈ వీడియోను చూసి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube