ఓటిటీలోకి రానున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు( Samantha ) కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ డ్రామా ”ఖుషి”.విజయ్ దేవరకొండ సినిమాలపై ఆడియెన్స్ లో ఒకరకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది.

 Vijay Deverakonda, Samantha Ruth Prabhu Kushi Ott Release, Vijay Devarakonda,-TeluguStop.com

అందుకే ఈయన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఫ్యాన్స్ మాత్రం చూస్తూనే ఉంటారు.అయితే విజయ్ కెరీర్ లో 12 సినిమాలు చేస్తే అందులో హిట్స్ కంటే ప్లాప్స్ నే ఎక్కువుగా ఉన్నాయి.

అయినప్పటికీ ఇతడు క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగింది.మరి లైగర్ వంటి ప్లాప్ తర్వాత ఖుషి సినిమాతో వచ్చి ఎట్టకేలకు హిట్ అయితే అందుకున్నాడు.కానీ విజయ్ రేంజ్ లో హిట్ అయితే పడలేదు.ముందుగా మంచి టాక్ వచ్చిన కలెక్షన్స్ ను బట్టి చుస్తే యావరేజ్ గా నిలిచింది.శివ నిర్వాణ ( Shiva Nirvana )దర్శకత్వంలో లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.

హేషం అబ్దుల్ సంగీతం అందించాడు.

ఈయన సంగీతమే సినిమాకు ప్రాణం పోసింది అనే చెప్పాలి.ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి ఇటీవలే థియేటర్స్ లో రన్ పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఒటిటి( OTT ) రిలీజ్ గురించి తాజాగా ఒక అప్డేట్ వినిపిస్తుంది.గత కొద్దిరోజులుగా ఓటిటిలో సందడి చేయనుంది అని టాక్ రాగా ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

విజయ్ ఖుషి సినిమా( Khushi Movie )ప్రముఖ ఓటిటి సంస్థ ఫ్యాన్సీ అంమౌంట్ తో దక్కించుకున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఓటిటి రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడగా ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ అయితే సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.అక్టోబర్ 1 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.థియేటర్స్ లో కంటే ఎక్కువ నిడివితో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

థియేటర్ లో సెన్సార్ కట్ చేసిన సీన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తుండగా ఆడియెన్స్ లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని మరింత క్యూరియాసిటీ పెంచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube