విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా నటించిన తాజా చిత్రం ఖుషి.లైగర్ తర్వాత విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.శివా నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ ముగ్గురికి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు.ఈ సినిమా హిట్ అయితే కనుక వీరి ముగ్గురి కెరియర్ గాడిలో పడ్డట్టే.
కాగా ఈ మూవీ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఖుషి మూవీ మేకర్స్( Khushi Movie Makers ) ప్రస్తుతం తమిళనాడులో చక్కర్లు కొడుతోంది.అక్కడికి వెళ్లి అక్కడి మీడియాతో విజయ్ దేవరకొండ ముచ్చటిస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్, చిరంజీవి గురించి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవ్వగా ఇప్పుడు బాలకృష్ణ( Balakrishna ) గురించి మాట్లాడిన మాటలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.
తాజాగా బాలకృష్ణ గురించి ఆయన మాట్లాడుతూ.ఆయననంటే తనకు చాలా ప్రేమను, ఆయన తన జీవితాన్ని ఒక పిల్లాడిలా గడుపుతాడు అని అన్నారు.ఈ సందర్భంగా విజయ దేవరకొండ మాట్లాడుతూ.
మొదటి సారి ఆయనను కలిసినప్పుడు నాకు చాలా సమయం పట్టింది.ఆయన ఇలా చిన్న పిల్లాడిలా ఎలా ఉండగలుగుతున్నాడని చెప్పుకొచ్చారు.ఆయన ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు.
నన్ను ప్రేమిస్తారు కాబట్టి ఆయనలో రెండో వైపు నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.నాతో ఎప్పుడూ చాలా బాగుంటారు, ఆయన చేస్తున్న భగవంత్ కేసరి( Bhagwant Kesari ) కోసం అందరిలానే నేను కూడా ఎదురుచూస్తున్నానని అని తెలిపారు.
అంత బాగానే ఉంది కానీ ఈ సినిమా ఫలితాల విషయంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు కాస్త టెన్షన్ గా భయంగా ఉన్నారని తెలుస్తోంది.ఈ సినిమా రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా కూడా విజయ్ పై నెటిజెన్స్ మరోసారి భారీగా విమర్శలు గుప్పించనున్నారు.