యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాతో భారీ ఫాలోయింగ్ అందుకున్న విజయ్ కు ”లైగర్”( Liger ) పెద్ద షాక్ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత విజయ్ తన నెక్స్ట్ లైనప్ ను ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా సెట్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా విజయ్ కొత్త సినిమాను లాంచ్ చేసాడు.విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్( Parasuram ) తో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే.ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) నటిస్తుంది.
గ్రాండ్ లాంచ్ జరుపుకున్న ఈ సినిమా నుండి అప్పుడే వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాకు మేకర్స్ రెండు టైటిల్స్ అనుకుంటున్నారు అని వార్తలు వస్తుండగా ఆ టైటిల్ పేర్లు విని విజయ్ ఫ్యాన్స్ ఆయన ఇమేజ్ కు సూట్ అవుతాయా అనే ఆలోచనలో పడుతున్నట్టు తెలుస్తుంది.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ బలంగా ఉండడమే కాకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ మెంట్ తో ఉంటుందట.

గీతా గోవిందం తర్వాత మళ్ళీ విజయ్ అలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు కుటుంబరావ్, ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.విజయ్ లాంటి హీరోకు ఇలాంటి టైటిల్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి.
అయితే ఇంకా చాలా సమయం ఉండడంతో ఫ్యాన్స్ కు కూడా అలవాటు అయ్యే అవకాశం ఉంది.
ఈ రెండు టైటిల్స్ తో పాటు మరో టైటిల్ కోసం ఫ్యాన్స్ అన్వేషిస్తున్నట్టు టాక్.
చూడాలి ఫైనల్ గా ఏది ఫిక్స్ చేస్తారో.దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 13వ సినిమాగా తెరకెక్కుతుంది.
గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.