వీడియో: ట్రైన్‌ దూసుకొస్తున్నా పట్టాలు దాటిన మహిళలు.. రెప్పపాటు సమయంలోనే ఘోరం!

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఒక రైలు దిగిన ప్యాసింజర్లు మరో ట్రాక్‌పై నుంచి దాటడం మొదలుపెట్టారు.

 Video Women Who Cross The Tracks While The Train Is Rushing ,viral Latest, News-TeluguStop.com

ఆ ట్రాక్‌ మీదగా మరో రైలు అత్యంత వేగంగా వస్తోంది.అయినా కూడా కొందరు మహిళా ప్యాసింజర్లు అదేమీ పట్టించుకోకుండా ట్రాక్‌ను దాటారు.

అంతలోనే ఒక షాకింగ్ ఘటన జరిగింది.ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ఒక సలహాతో ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

“జీవితం మీది.నిర్ణయమూ మీదే,” అని ఒక క్యాప్షన్ జోడించారు.

వీడియోలో ఓ రైల్వే ప్లాట్‌ఫామ్‌పైన ఒక రైలు నుంచి కొంత మంది ప్రయాణికులు దిగడం మీరు గమనించవచ్చు.ఒక కుటుంబం, ఆ కుటుంబంలోని మహిళలు హడావుడిగా ట్రాక్ దాటుతున్నారు.

ఎందుకంటే ట్రాక్ పై నుంచి మరో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ చాలా వేగంగా దూసుకొస్తోంది.అయినా కూడా వీరు వెయిట్ చేయకుండా లగేజీని హడావుడిగా ట్రాక్‌కి అవతలి వైపుకు విసిరేయడం, అటూ ఇటూ పరిగెత్తడం చేశారు.

ఇంతలోనే ఒక మహిళ ట్రైన్ చాలా దగ్గరగా వచ్చినప్పుడే పట్టాలను క్రాస్ చేసింది.ట్రైన్ ఆమెను ఢీ కొడుతుందని అందరూ అనుకున్నారు.

కానీ కొద్దిలో ఆమె తప్పించుకోగలిగింది.రెప్పపాటు సమయం ఆలస్యం చేసినా ఆమెను ట్రైన్‌ ఢీకొట్టి ఉండేది.

అదే జరిగితే ఆమె బాడీ ఛిద్రం అయ్యేది.అదృష్టవశాత్తూ, ఆమె సురక్షితంగా ఘోర ప్రమాదం నుంచి క్షణకాలంలో ఎస్కేప్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు “వామ్మో, ఇది చూస్తుంటే మాకు ఒళ్లు జలదరించింది” అని కామెంట్ చేస్తున్నారు.“పిచ్చితనం, మూర్ఖత్వం అంటే ఇదే, ఇలాంటి పిచ్చి పనులు వల్లే ప్రాణాలు పోతాయి.ఒక రెండు నిమిషాలు ఆలస్యమైతే ఏం పోతుంది” అని ఇంకొందరు ఆ యువతిని తిడుతున్నారు.ట్రైన్ వస్తున్నా ట్రాక్‌ను క్రాస్ చేసిన మిగతా ప్యాసింజర్లను కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

ఈ షాకింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube