ప్రేమకు( Love ) వయస్సు, కులం, మతంతో సంబంధం లేదని అంటారు.ప్రేమ అనేది ఎవరి మీద అయినా పుట్టవచ్చు.
మన మనస్సుకు నచ్చినవారితో ప్రేమలో పడతాం.ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్ వేరేగా ఉంటుంది.
మనం ప్రేమించినవారు పక్కన ఉంటే మనస్సు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని అంటూ ఉంటారు.
ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
మాములుగా నిజమైన ప్రేమ( True Love ) అనేది వ్యక్తుల మధ్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.వయస్సు దాటిపోయిన తర్వాత ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.కానీ కొంతమంది మాత్రమే ఎప్పటికీ ఆప్యాయతతో ఉంటూ తమ ప్రేమను వ్యక్తపర్చుకుంటూ ఉంటారు.
తాజాగా అలాంటి దృశ్యం ఒకటి చోటుచేసుకుంది.కోల్‌కత్తాలోని( Kolkata ) ఒక లోకల్ ట్రైన్‌లో ఒక వృద్ధ జంట( Old Couple ) ప్రయాణిస్తుంది.
ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఇద్దరూ బిస్కెట్లు పంచుకుంటున్నారు.
భర్త బిస్కెట్ ప్యాకెట్ ను ఓపెన్ చేసి పక్కన ఉన్న భార్యతో పంచుకున్నాడు.వృద్దాప్యంలో కూడా భార్య పట్ల భర్త చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతన్నారు.
కంపార్ట్‌మెంట్ లో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ఈ వృద్ధ జంటు బిస్కెట్ ప్యాకెట్ ను పంచుుకుంటున్న దృశ్యాలను మొబైల్ లో బంధించాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.కోల్ కత్తా ఫ్రేమ్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో దీనిని షేర్ చేశారు.ఈ వీడియోకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది ఈ వీడియెను చూశారు.ఎన్నో ఏళ్లుగా ఒక వ్యక్తితో ఇలా ప్రేమలో ఉండటం గ్రేట్ అని కొంతమంది కామెంట్ చేస్తుండగా.
నిజమైన ప్రేమ అంటే ఇదేనని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.వీరి ప్రేమను చూస్తే ముచ్చటగా ఉందని మరికొందరు అంటున్నారు.