కొంతమంది తల్లిదండ్రులు ఎంత ముసలి వాళ్ళయినా సరే తమ పిల్లల కోసం ఏం చేయడానికి అయినా రెడీ అవుతారు.కష్టమైనా సరే ఇష్టంగా మోస్తుంటారు.
తమ పిల్లల సంతోషమే తమ సంతోషంగా చాలామంది భావిస్తారు.తాజాగా తమిళనాడులోని పుదుక్కోట్టైలో తన కూతురికి పొంగల్ కానుకగా చెరకు గుత్తిని తీసుకెళ్లాడో వృద్ధుడు.
ఈ వృద్ధుడికి స్కూటర్ లేదా బైక్ లేదు.ఉన్నదల్లా ఒకటే సైకిల్.
దానికి ముందు వెనక సరుకుల సంచిలను ఏ వృద్ధుడు తగిలించాడు.ఇక ఖాళీ స్థలం లేక తన తలపైన కొన్ని చెరకు గడలను పెట్టుకొని సైకిల్ పై పయనమయ్యాడు.
చెరకు ( sugar cane )గుత్తిని తలపై పెట్టుకుని సైకిల్‌పై ఏకంగా 14 కిలోమీటర్లు ప్రయాణించాడు.అవి వొత్తుకోకుండా తలపై ఒక టవల్ పెట్టుకున్నాడు.ప్రజలు అతనిని ఆశ్చర్యంతో చూశారు, మార్గం మధ్యలో అతనిని ఉత్సాహపరిచారు.దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI( News agency ANI ) షేర్ చేసింది.
దీనికి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.
ఈ వృద్ధుడు పేరు చెల్లదురై.ఆయన మాట్లాడుతూ.తన కూతురు సుందరపాల్‌కి( Sundarpal ) పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టలేదని.
చివరికి ఎనిమిదేళ్ల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పాడు.అప్పటినుంచి తలపై చెరకు గడలు మోస్తూ సైకిల్ తొక్కుతూ ఆమెకు పొంగల్ కానుకగా ఇవ్వడం మొదలుపెట్టానని చెల్లదురై చెప్పాడు.
తాను ఆరోగ్యంగా ఉన్నానని, అందుకే తన కూతురు, మనవళ్లను చూసేందుకు సైకిల్‌పై సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నానని చెప్పాడు.ఈ వృద్ధుడు తన కూతురి పట్ల చూపుతున్న ప్రేమ చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.
ఈ తండ్రికి హ్యాట్సాఫ్ చెప్పినా తక్కువే అంటున్నారు.