Veera Simha Reddy : ఒకే థియేటర్ లో 365 రోజులు ఆడిన బాలయ్య వీరసింహారెడ్డి.. మరో రికార్డ్ చేరిందిగా!

ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ థియేటర్లో ఒక నెల రోజులు కూడా ఆడడం కష్టమే.మహా అంటే ఒక 50 రోజులు ఆడుతున్నాయని చెప్పవచ్చు.

 Veera Simha Reddy Played In Sln Theatre One Year-TeluguStop.com

ఇక వంద రోజులు అంటే చాలా కష్టమని చెప్పవచ్చు.ఒకప్పుడు ఒక్కొక్క సినిమా ఏడాది పొడవునా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కానీ ప్రస్తుత రోజుల్లో సినిమా అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.విడుదలైన నెల రోజుల్లోనే సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తోంది.

మరి అలాంటి రోజుల్లో బాలయ్య బాబు( Balakrishna ) సినిమా ఏకంగా 365 రోజులు ఆడి సరికొత్త రికార్డును సృష్టించింది.నందమూరి బాలకృష్ణ ,గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన మూవీ వీరసింహారెడ్డి.

Telugu Balakrishna, Honey Rose, Kurnool, Shruti Haasan, Sln Theatre, Thaman, Tol

2023 సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల అయిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.అలాగే బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రంగా నిలిచింది.ఇప్పుడు ఈ వీరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా ఆలూరు లోని SLNS థియేటర్ లో నిన్నటితో 365 రోజులు పూర్తి చేసుకొని కనివిని ఎరుగని రికార్డు సృష్టించింది.

పైగా రోజు ఎలాంటి షిఫ్ట్ లు లేకుండా రోజు నాలుగు ఆటలతో ఒకే థియేటర్ లో సంవత్సరం ఆడింది.తెలుగు చలన చిత్ర పరిశ్రమకి సంబంధించి ఇదొక నయా రికార్డు అని చెప్పవచ్చు.

Telugu Balakrishna, Honey Rose, Kurnool, Shruti Haasan, Sln Theatre, Thaman, Tol

వీరసింహారెడ్డి ఈ స్థాయిలో ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం వన్ అండ్ ఓన్లీ నందమూరి నట సింహం బాలకృష్ణ.ఈ మూవీ లో తాను పోషించిన రెండు పాత్రల్లోను బాలయ్య విజృభించి నటించాడు.ముఖ్యంగా వీరసింహారెడ్డి క్యారక్టర్ లో చెల్లెలి సంతోషం కోసం తన ప్రాణాలని కూడా నవ్వుతూ ఇచ్చే క్యారక్టర్ లో బాలయ్య నటన ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టించింది.మైత్రి మూవీ మేకర్స్ పై నిర్మాణం జరుపుకున్న వీరసింహారెడ్డి లో శృతి హాసన్, హనీ రోజ్,వరలక్ష్మి శరత్ కుమార్,దునియా విజయ్ తదితరులు నటించారు.

థమన్( Thaman S ) సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు.

Telugu Balakrishna, Honey Rose, Kurnool, Shruti Haasan, Sln Theatre, Thaman, Tol

ఇక వీరసింహారెడ్డి ( Veera Simha Reddy )వన్ ఇయర్ ఆడటం పట్ల నందమూరి అభిమానులు అయితే జై బాలయ్య అంటు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి అరుదైన రికార్డు సృష్టించడం బాలయ్య వల్లే అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube