కాల్ సెంటర్ ప్రారంభించిన రెండో రోజే జగన్ పై ఫిర్యాదు

తమ ప్రభుత్వ హయాంలో పారదర్శకమైన పరిపాలన ప్రజలకు అందాలని, ఎటువంటి అవినీతి వ్యవహారాలు ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ నెలకొనకుండా జగన్ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అయితే దీనికోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ను సైతం జగన్ ఏర్పాటు చేసాడు.” చేయి చేయి కలుపుదాం , అవినీతి భూతాన్ని తరిమివేద్దాం.లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమంటూ ప్రచారం చేస్తూ ఫిర్యాదుల స్వీకరణ కోసం ‘14400’ టోల్‌ఫ్రీ నంబర్‌ను జగన్ ఏర్పాటు చేశారు.

 Varla Ramaiah Compliant On Cm Ys Jagan To Call Center-TeluguStop.com

అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌ – జగనన్న ప్రభుత్వ ఆశయం అంటూ రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ సోమవారమే ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఇది ప్రారంభించి కేవలం 24 గంటలు గడవక ముందే టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య 14400కి కాల్ చేసి తన ఫిర్యాదు నమోదు చేశారు.

అయితే ఇది ఆషామాషీ ఫిర్యాదు కాదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఫిర్యాదు చేశారు.వైఎస్ జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ జగన్ వేల కోట్లు సంపాదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే దీనిపై అధికారాలు ఏవిధంగా ముందుకు వెళ్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube