మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్య కాలంలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్( Vaishnav tej ) బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లను చవి చూస్తున్నాడు.మొదటి సినిమా ఉప్పెన తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసింది.ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరో కి కానీ, ఏ తెలుగు హీరో కి కానీ మొదటి సినిమా తో వంద కోట్ల వసూళ్లు సాధ్యం కాలేదు.
కానీ వైష్ణవ్ తేజ్ కి ఆ రికార్డ్ దక్కింది.ఆ ఆనందం కొన్నాళ్లు కూడా మిగల్లేదు.
హీరో వైష్ణవ్ తేజ్ తదుపరి సినిమా కొండ పొలం కమర్షియల్ గా నిరాశ పరిచింది.
ఇక రంగ రంగ వైభవంగా సినిమా( Ranga Ranga Vaibhavanga movie ) కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.చాలా ఆశలు పెట్టుకుని వచ్చిన ఆదికేశవ సినిమా కి కూడా నెగటివ్ రివ్యూలు వచ్చాయి.ఏ స్థాయి లో వసూళ్లు ఉంటాయో మరో వారం గడిస్తే కానీ క్లారిటీగా చెప్పలేం.
మొత్తానికి ఆదికేశవ సినిమా( Adikesha movie ) కూడా పోయినట్లే అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుకున్న దాన్ని బట్టి అర్థం అవుతోంది.దాంతో వైష్ణవ్ తేజ్ సినిమా ల ఎంపిక విషయం లో మామయ్య ల సలహా లు లేవా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
పాపం ముగ్గురు మామయ్య లు కూడా బిజీగా ఉండటం వల్ల వైష్ణవ్ తేజ్ తన సినిమా లను తానే ఎంపిక చేసుకుంటూ ఉన్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వైష్ణవ్ తేజ్ విషయం లో మెగా ఫ్యామిలీ లైట్ తీసుకుంటుందా అంటున్నారు.
కథల ఎంపిక విషయం లో అన్నయ్య సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) ని అయినా ఫాలో అవ్వాలని మెగా ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.మొత్తానికి చిన్నల్లుడు సెటిల్ అయ్యే వరకు కాస్త మామయ్య లు పట్టించుకుంటే బాగుండు కదా అంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.