ప్రతివారం లాగే ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద అలాగే ఓటీటీలో సందడి చేయడానికి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు వెబ్ సీరిస్ లు సిద్ధంగా ఉన్నాయి.ఇక నవంబర్ మూడో వారంలో ఏ సినిమాలు విడుదల కానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్, అజ్మల్ అమిర్ ( Payal Rajpoot, Ajmal Amir )ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మంగళవారం( mangalavaram ).ఈ సినిమా నవంబరు 17న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.అలాగే హీరోయిన్ హన్సిక తాజాగా నటించిన చిత్రం మై నేమ్ ఈజ్ శ్రుతి( My name is Shruti ).శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.విక్రాంత్ హీరోగా నటించడంతో పాటు స్వయంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం స్పార్క్ లైఫ్( Spark Life ).ఈ మూవీని డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.మెహరీన్, రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్ గా నటించారు.
ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది.కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్-ఎ.
ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో నవంబర్ 17న విడుదల కానుంది.
అలాగే విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం అన్వేషి( anveshi ).
ఈ సినిమాకు వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు.ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు /వెబ్‌సిరీస్ ల విషయానికి వస్తే.అమెజాన్ ప్రైమ్ లో ట్విన్ లవ్( Twin love ) అనే హాలీవుడ్ మూవీ నవంబరు 17 విడుదల కానుంది.అపూర్వ( apurva ) అనే హిందీ మూవీ నవంబరు 15 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
కానుంది.చిత్త మూవీ తమిళ,తెలుగు భాషల్లో నవంబరు 17 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.
అలాగే కన్నూర్ స్క్వాడ్ మలయాళం మూవీ నవంబరు 17 న స్ట్రీమింగ్ కానుంది.ఇక నెట్ ఫిక్స్ లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే.
హౌటూ బికమ్ ఏ మాబ్ బాస్ అనే వెబ్‌సిరీస్ నవంబరు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.బెస్ట్ క్రిస్మస్ ఎవర్ అనే హాలీవుడ్ మూవీ నవంబరు 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది క్రౌన్( The Crown ) అనే వెబ్‌సిరీస్ నవంబరు 16 ముంచి స్ట్రీమింగ్ కానుంది.అలాగే బిలీవర్2 అనే కొరియన్ మూవీ నవంబరు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలాగే ది డాడ్స్ హాలీవుడ్ మూవీ నవంబరు 17 న విడుదల కానుంది.సుఖీ అనే హిందీ మూవీ నవంబరు 17 నుంచి విడుదల కానుంది.
అలాగే ది రైల్వేమెన్ అనే హిందీ మూవీ నవంబరు 18 నుంచి విడుదల కానుంది.