గోవా అంటే బీచ్, బికినీ కాదురా అయ్యా ? జనాలు మర్చిపోయిన సినిమా పండగ !

గోవా… ఈ పేరు చెప్తే అందరికి గుర్తుకు వచ్చేది కేవలం బీచ్, బికినీలు, మందు మాత్రమే.నిద్రలో ఉన్న కూడా గోవా పేరు చెప్తే అక్కడ దొరికే బ్రాండ్స్ తో సహా చెప్పేస్తాం.

 Untold Facts About Goa Film Festival Details, Goa Film Festival, Goa, Goa Intern-TeluguStop.com

గత కొన్నేళ్లుగా గోవా అంటే అది మాత్రమే.అందుకే దేనికి ఒక బ్రాండ్ మార్క్ పడకూడదు.

ఒకసారి ఒక బ్రాండ్ పడిందా ఇక అంతే సంగతులు.అక్కడ ఏం జరిగిన మనం ఒకే బ్రాండ్ అనే ముద్ర తో చూస్తూ ఉంటాం.

అందుకే గోవా అంటే ఇప్పుడు యూత్ కి ఇచ్చిన బ్రాండ్ మాత్రమే ఎక్కువ పాపులర్ అయ్యింది.దాంతో ఎంతో సాంప్రదాయ, సంస్కృతుల గురించి మనం మర్చిపోయాం.

భరత్ లో బీచ్, బికిని సంస్కృతి మరియు సమ్మేళనాలు అనే మార్కు లేకుండా బలయినపోయిన రాష్ట్ర గోవా.

ప్రతి ఏటా భారత ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఇంటెర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా మాత్రం ఎవ్వరికి గుర్తుకు రాదు.

కేవలం సినిమా అంటే పిచ్చి ఉన్న కొంత మందికి మాత్రమే గోవా పేరు చెప్తే ఈ ఫెస్ట్ గుర్తుకు వస్తుంది.వాస్తవానికి గోవా లో ఈ ఇంటర్నేషనల్ ఫెస్ట్ అధికారికంగా 2004 లో శాశ్వత వేదికగా మారింది.

ఈ చలన చిత్రోత్సవం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ప్రొడ్యూసర్స్ డే ఫిలిమ్స్ నుంచి ‘ఏ’ గ్రేడ్ పొందింది.కేన్స్, బెర్లిన్, వెనిస్, కార్లొవై వారీ అండ్ మాస్కో ఫిలిం ఫెస్టివల్స్ తో సమానంగా మన గోవా ఫిలిం ఫెస్టివల్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన హోదా కలిగి ఉంది.

Telugu Aakhari Poratam, Goa Festival, Magadheera, Pataalabhairavi, Sagarasangama

కానీ ఈ విషయాలు మన దేశంలోని వారికీ చాలా మందికి తెలియదు.ఈ ఫెస్టివల్ లో మన తెలుగు సినిమాలు సైతం ప్రసారం చేయబడుతూ వస్తున్నాయి.IFFI 2019 లో F2 సినిమాను ఎంపిక చేసినప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ల్స్ జరిగాయి.ఇలాంటి ఒక సినిమా గోవా ఫెస్టివల్ కి ఎలా సెలెక్ట్ చేసారు అని అంత భావించారు.

ఎందుకంటే ఈ చిత్రోత్సవాల్లో ఎక్కువగా ఆర్ట్ మూవీస్ మాత్రమే చూస్తారు అనే ఆలోచన ధోరణి ఉండటం.ఈ గోవా చలన చిత్రోత్సవం 1952 లో మొదటి సారి ప్రారంభించారు.

అప్పుడు ఎన్టీఆర్ సినిమా పాతాళభైరవి మెయిన్ స్ట్రీమ్ సెక్షన్ లో ప్రదర్శించబడింది.

Telugu Aakhari Poratam, Goa Festival, Magadheera, Pataalabhairavi, Sagarasangama

ఆ తర్వాత నాగార్జున నటించిన ఆఖరి పోరాటం, బాపు సినిమా పెళ్లి పుస్తకం, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, చూడాలని ఉంది, ఆనంద్, మహానటి వంటి కమర్షియల్ సినిమాలు సైతం అక్కడ మెయిన్ స్ట్రీమ్ లో ప్రదర్శించారు.ఇక 2006 లో రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా సైతం ప్రదర్శించబడింది.ఇక చిరంజీవి స్టాలిన్ మూవీ ని సైతం గోవా ఫిలిం ఫెస్ట్ లో ఉంచారు.స్వాతిముత్యం, సాగరసంగమం’, ‘సితార, శంకరాభరణం, శ్రీరామరాజ్యం వంటి క్లాసిక్ సినిమాలు సైతం ప్రదర్శనకు నోచుకున్నాయి.2018 రాజమౌళి మగధీర చిత్రం గురించి అల్లు అరవింద్ ఈ ఫెస్ట్ లో రౌండ్ టేబుల్ బిజినెస్ కాన్ఫిరెన్స్ లో సినిమా నిర్మాణ పద్దతుల గురించి స్పీచ్ కూడా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube