అమ్ముడు పోని ప్రభాస్ కొత్త సినిమా..?

ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) ఒక అంతర్జాతీయ హీరో అనే చెప్పాలి ఎందుకంటే ఆయన చేసిన సినిమాల్లో బాహుబలి ఒక వండర్ క్రియేట్ చేసిందనే చెప్పాలి ఈ సినిమాతో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చిందని మనందరికీ తెలుసు ఇక ఆ సినిమాతోనే ఏకంగా మలేషియా ప్రభాస్ విగ్రహం పెట్టారనే విషయం కూడా మనకు తెలిసిందే…అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఇటీవల కాలంలో వందల కోట్ల బిజినెస్ లు చేస్తున్నాయి… బాహుబలి సినిమా 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఆ తర్వాత సినిమాలతో ప్రభాస్ అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటాడు అని అనుకున్నారు.కానీ పరిస్థితి మాత్రం భిన్నంగా మారుతుంది.

 Unsold Prabhas New Movie Adipurush , Prabhas,m Adipurush , T-series , Project K-TeluguStop.com
Telugu Bollywood, Adipurush, Om Raut, Prabhas, Project-Latest News - Telugu

ఇంతకుముందు వచ్చిన సాహో సినిమాతో పాటు రాధేశ్యామ్ రెండు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు అయినా కూడా ప్రభాస్ రేంజ్ఏ మాత్రం తగ్గలేదు రాబోయే ప్రాజెక్టులు తప్పకుండా సక్సెస్ అవుతాయని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.ముఖ్యంగా సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్ K పై అంచనాలు భారీగానే ఉన్నాయి.ప్రస్తుతం తెరకెక్కుతున్న సలార్ సినిమాతో ప్రభాస్ అత్యధిక స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయబోతున్నాడు.తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ కనిపిస్తుంది… అలాగే మహేష్ బాబు సినిమా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది.

మహేష్ 28వ సినిమా హైప్ క్రియేట్ చేయబోతోంది.ఈ సినిమా తెలుగులోనే దాదాపు 250 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ మార్క్ ను అందుకునే అవకాశం ఉంది.

 Unsold Prabhas New Movie Adipurush , Prabhas,m Adipurush , T-Series , Project K-TeluguStop.com

అయితే ప్రభాస్ ఆదిపురుష్ బిజినెస్ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు ఎలాంటి పాజిటివ్ బజ్ క్రియేట్ కాలేదు.అలాగే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువవుతున్నాయి.రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడే గ్రాఫిక్స్ అత్యంత దారుణంగా ఉన్నాయని ట్రోల్ అయితే చేశారు.

Telugu Bollywood, Adipurush, Om Raut, Prabhas, Project-Latest News - Telugu

ఆదిపురుష్( Adipurush ) సినిమాను జూన్ 22న విడుదల చేయాలని అనుకుంటున్నారు… అయితే సినిమా విడుదల తేది దగ్గరపడుతున్న కూడా సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదని టాక్ ఇక చేసేదేమీ లేక చాలా ఏరియాలలో నిర్మాణ సంస్థ టీ సీరీస్ ( T-Series )ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో ప్రభాస్ సినిమా అంటేనే ఎగబడి కొనుక్కునే వారు.కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది.అయితే ఇది దర్శకుడు ఓం ప్రకాష్ తప్పు తప్ప .ప్రభాస్ ది ఏమి లేదని .సలార్ , ప్రాజెక్ట్ కె సినిమాలతో ప్రభాస్ పవర్ ఏంటో తెలుస్తుందని అయన అభిమానులు అంటున్నారు .అయితే ఆదిపురుష్ అమ్ముడుపోకపోతే అది ప్రభాస్ కి ఒకరకంగా అవమానమే అనేవారు లేకపోలేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube