కెనడా నుంచి ఇండియాకి వెళ్లి అల్లుడిని సర్‌ప్రైజ్ చేసిన మేనమామ..

ఉద్యోగరీత్యా చాలామంది తమ బంధువులను( Relatives ) వదిలిపెట్టి దేశాలకు వెళ్తుంటారు.దీని వల్ల చాలామంది వారిని మిస్ అవుతుంటారు.

 Uncle Went To India From Canada And Surprised His Son-in-law, Viral Video, Viral-TeluguStop.com

ముఖ్యంగా చిన్నపిల్లలు అని చెప్పుకోవచ్చు.అయితే తాజాగా విదేశాల్లో ఉంటున్న ఓ వ్యక్తి చాలా కాలానికి ఇండియా వచ్చారు.

ఆయన తన మేనల్లుడిని ( Nephew ) ఎంతో ఆశ్చర్యపరిచేలా ఇంటికి సీక్రెట్‌గా వచ్చారు.దాంతో ఆ బాలుడు చాలా ఆశ్చర్యానికి లోనవుతూ సంతోషం వ్యక్తం చేశాడు.

వీరిద్దరూ కలుసుకున్న హార్ట్ టచింగ్ సీన్ సంబంధించి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియో ప్రకారం, స్కూల్ యూనిఫాం వేసుకుని ఇంటికి వచ్చిన బాలుడు, తన మామయ్య కెనడా( Canada ) నుంచి వచ్చాడా అని ఆత్రుతగా అమ్మను అడుగుతాడు.

బాలుడు తన మామయ్య రాబోతున్న విషయాన్ని టీచర్‌కి కూడా చెప్పాను అని సరదాగా చెబుతాడు.తర్వాత, తన మామయ్య ఎక్కడ ఉన్నాడో అని ఇంటి అంతా వెతుకుతుంటాడు.

కానీ, అనుకోకుండా.క్యాజువల్ డ్రెస్‌లో ఉన్న మామయ్య ఇంట్లోకి వస్తాడు.

అంతే.ఆ బుడ్డోడు గాల్లో ఎగిరి “చాచా!” అంటూ గట్టిగా హత్తుకుంటాడు.

ఆనందంతో మునిగిన మామయ్య, బుగ్గ మీద ముద్దు పెట్టి, ఎత్తుకుంటాడు.

ఈ వీడియోను @nav.danish అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు.వీడియో చూసిన తర్వాత గుర్తొచ్చిన ప్రత్యేకమైన వ్యక్తిని ట్యాగ్ చేయమని వీడియోకి క్యాప్షన్ కూడా జోడించారు.

మామయ్య, అల్లుడు ఆనందంగా కలిసిన దృశ్యాలు చూసి నెటిజన్ల హృదయాలు కరిగిపోయాయి.ఈ వీడియో రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన సమయం నుంచి లక్షల కొద్దీ వ్యూస్, లైకులు రాబట్టింది.

చాలా మంది ప్రజలకు ఇది గుర్తుకు వచ్చింది.వీడియో కామెంట్ సెక్షన్ హార్ట్ ఎమోజులతో నిండి పోయింది.

ఒక యూజర్ పూర్తిగా కారణం తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా కామెంట్ చేశారు.మరొకరు పిల్లలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వారు ఇలానే సంతోషిస్తారు అని తెలిపారు.ఇంకొందరు తమ మామయ్యల పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ వారిని ఉత్తమమైన వారుగా పిలిచారు, వీడియోలోని “నిజమైన ప్రేమ” ప్రదర్శనను కొనియాడారు.ఈ బ్యూటిఫుల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube