పొలంలో పనిచేసే కూలీలకు ఎండ పెద్ద ఇబ్బంది కలిగించి, పనులకు అంతరాయం కలిగిస్తుంది.ప్రధానంగా మిరప, పత్తి, కూరగాయ( Chili, cotton, vegetable ) పంటలలో వ్యవసాయ కూలీలకు, రైతులకు ఎండ సమస్య మాటల్లో చెప్పలేనిది.
ఇక వేసవికాలం వచ్చిందంటే ఈ ఎండతో రైతులు, కూలీలు పడే పాట్లు వర్ణించడం కూడా కష్టమే.ఎండ వల్ల పనులకు పూర్తి అంతరాయం కలగడంతో సకాలంలో పనులు పూర్తికాక రైతులు నానా తంటాలు పడుతున్నారు.
అయితే ఎండ నుండి ఉపశమనం పొందడం కోసం ఓ రైతు సామూహిక గొడుగును రూపొందించాడు.పొలంలో పనిచేస్తున్నప్పుడు ఎండ నుండి ఉపశమనం పొందడం కోసం చక్రాలతో కూడిన ఒక గొడుగులు( Umbrellas ) తయారు చేసి చక్కటి పరిష్కారం కనుగొన్నాడు.20 అడుగుల వెడల్పు, ఏడు అడుగుల ఎత్తు ఉండే ఈ చక్రాల గొడుగు ఆరు అడుగుల మేర నీడనిస్తుంది.
ఇనుప పైపులతో తయారుచేసిన ఈ గొడుగు దాదాపు 15 కిలోల బరువు ఉంటుంది.దీనిని తయారు చేయడానికి రూ.5 వేల వరకు ఖర్చు అవుతుంది.పది నిమిషాల్లో గొడుగు విడిభాగాలను అమర్చి ఒక చోట నుండి మరొక చోటకి మార్చవచ్చు.ఈ గొడుగును ఎక్కువగా నట్లు, బోల్టుల తో తయారుచేశారు.
కాబట్టి దీనిని విడదీయడం, అమరచడం చాలా సులభం.పైగా ఈ గొడుగు చూసిన ఏ వెల్డర్ అయినా సులభంగా తయారు చేయగలుగుతారు.
ప్రస్తుతం ఈ రైతు తయారు చేసిన ఈ గొడుగు చూసి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.పొలంలో కలుపు తీసే సమయంలో, కూరగాయలు కోసే సమయంలో, మిరప తోటలో మిరప తెంపే సమయంలో, పత్తి తీసే సమయంలో ఈ సామూహిక గొడుగు చాలా ఉపయోగపడుతుంది.
ఇక వేసవి కాలంలో ఎండబెట్ట నుండి కాపాడుకోవడంలో ఈ గొడుగు చాలా ఉపయోగపడుతుందని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.