ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని బ్రైటన్ సముద్ర తీర రిసార్ట్‌లోని స్థానిక కౌన్సిల్ ఈ అక్టోబర్ నుంచి పట్టణంలోని ఇండియాగేట్ మెమోరియల్( Indiagate Memorial ) వద్ద రెండు ప్రపంచ యుద్ధాలలో పాల్గొన్న భారతీయ సైనికులను స్మరించుకోవడానికి ప్రణాళికలను ఆమోదించింది.ఇండియా గేట్‌ను భారత యువరాజులు, ప్రజలు బ్రైటన్ వాసులకు అందించారని కౌన్సిల్ ప్రశంసించింది.
అక్టోబర్ 26, 1921న పాటియాలా మహారాజా భూపిందర్ సింగ్ ( Maharaja Bhupinder Singh of Patiala )చేతుల మీదుగా ఇండియా గేట్‌ను ఆవిష్కరించారు.రాయల్ పెవిలియన్ దక్షిణ ప్రవేశ ద్వారం వద్ద ఇది వుంది.
బ్రైటన్‌లోని మూడు భవనాలలో బేస్ హాస్పిటల్‌గా అవిభక్త భారతదేశానికి చెందిన సైనికులకు చికిత్స అందించింది.వెస్ట్రన్ ఫ్రంట్‌లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల సైనికులు వున్నారు.
సంస్మరణ దినాన్ని నిర్వహించడం ద్వారా .యుద్ధంలో బ్రిటన్( Britain ) కోసం పోరాడిన అవిభక్త భారత సైనికుల జ్ఙాపకాలను నగరం భద్రంగా కాపాడుతుందని బ్రైటన్ అండ్ హోవ్ కౌన్సిల్ పేర్కొంది.శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నివేదికను ఆమోదించారు.ఈ కీలక చరిత్రను సమకాలీన తరాల వారు విస్తృతంగా అర్ధం చేసుకుని, గుర్తించేలా చూసుకోవచ్చని కౌన్సిల్ పేర్కొంది.ఇండియా గేట్ ముఖ్యమైన చారిత్రక సందర్భం, పెవిలియన్ ఎస్టేట్ ఇటీవలి చరిత్రలో పెరిగిన ఆసక్తిని దృష్టిలో వుంచుకుని అంతర్జాతీయ ఖ్యాతికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
![Telugu Brighton, Britain, Indian Soldiers, Thomas Tyrwhitt, Uksindia, Wars-Telug Telugu Brighton, Britain, Indian Soldiers, Thomas Tyrwhitt, Uksindia, Wars-Telug](https://telugustop.com/wp-content/uploads/2024/04/UKs-India-Gate-to-commemorate-role-of-Indian-soldiers-from-World-Warsc.jpg)
థామస్ టైర్‌విట్( Thomas Tyrwhitt ) రూపొందించిన ఇండియా గేట్ .1850లో పెవిలియన్‌ను కొనుగోలు చేసిన తర్వాత బ్రైటన్ కార్పోరేషన్ ( Brighton Corporation )ఏర్పాటు చేసిన చాలా దిగువ స్థానంలో వుంది.గుజరాత్ నుంచి ప్రేరణగా తీసుకుని నాలుగు స్తంభాలపై వున్న గోపురంగా ఈ నిర్మాణాన్ని తీర్చిదిద్దారు.
చారిత్రక రికార్డుల ప్రకారం.మొదటి ప్రపంచ యుద్ధంలో (1914-1918) దేశ విభజనకు ముందు నాటి భారతదేశానికి చెందిన 1.5 మిలియన్లకు పైగా సైనికులు బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.న్యూవ్ చాపెల్లె వార్, గల్లిపోలీ వార్, సోమ్ వార్ వంటి ప్రధాన యుద్ధాల్లో వారు పాల్గొన్నారు.
![Telugu Brighton, Britain, Indian Soldiers, Thomas Tyrwhitt, Uksindia, Wars-Telug Telugu Brighton, Britain, Indian Soldiers, Thomas Tyrwhitt, Uksindia, Wars-Telug](https://telugustop.com/wp-content/uploads/2024/04/UKs-India-Gate-to-commemorate-role-of-Indian-soldiers-from-World-Warsd.jpg)
రెండవ ప్రపంచ యుద్ధంలో (1993-1945)లలో అవిభక్త భారతదేశం నుంచి 2.5 మిలియన్లకు పైగా సైనికులు బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.ఇది చరిత్రలోనే అతిపెద్ద వాలంటీర్ ఆర్మీ.బ్రైటన్‌లోని రాయల్ పెవిలియన్ ఇండియన్ హాస్పిటల్.ఈ యుద్ధాల్లో గాయపడిన వారికి చికిత్స అందించింది.హిందువులు, సిక్కులను దహనం చేసిన ప్రదేశంలో చత్రీ స్మారక చిహ్నం కూడా వుంది.
దీనితో పాటు కామన్‌వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ నిర్వహించే స్మారక చిహ్నం కూడా వుంది.