బ్రిటన్‌లో ప్రపంచంలోనే తొలి ‘‘ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్’’.. రిషి సునాక్ కీలక ప్రకటన

ప్రస్తుతం ఎక్కడ చూసినా కృత్రిమ మేథ (ఏఐ) గురించే చర్చ.మనిషికి మించి ఆలోచిస్తూ, అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనులు చేసే ఏఐ టెక్నాలజీతో( Artificial Intelligence ) భవిష్యత్తులో ఎన్నో విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 Uk To Set Up Ai Safety Institute, Pm Rishi Sunak Says Ahead Of Global Tech Summi-TeluguStop.com

ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో జరగబోయే నష్టం మన ఊహకు కూడా అందదని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాలు , అభివృద్ధి చెందిన దేశాలు అలర్ట్ అయ్యాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఎదురయ్యే ముప్పు, టెక్నాలజీ దుర్వినియోగంపై ఫోకస్ పెట్టాయి.కానీ కొన్ని అంశాల్లో కృత్రిమ మేథను వినియోగించుకోవాలని పలు దేశాలు భావిస్తున్నాయి.

Telugu Aisafety, America, Bletchley Park, China, Tech Summit, Pm Rishi Sunak-Tel

ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని, భారత సంతతికి చెందిన రిషి సునాక్( Rishi Sunak ) కీలక ప్రకటన చేశారు.ప్రపంచంలోనే మొట్టమొదటి ‘‘ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్’’ను యూకే ఏర్పాటు చేయనుందని తెలిపారు.వచ్చే వారం జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ముందు .సాంకేతికత వల్ల కలిగే నష్టాలను పరిశీలించడానికి సమావేశమైనట్లు రిషి సునాక్ వెల్లడించారు.బ్రిటన్ నెలకొల్పనున్న ఇన్‌స్టిట్యూట్ కొత్త రకాల ఏఐలను పరిశీలించి , మూల్యాంకనం చేసి, పరీక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.తద్వారా ప్రతి మోడల్ సామర్ధ్యం ఏంటో తాము అర్ధం చేసుకుంటామని.

పక్షపాతం, తప్పుడు సమాచారం వంటి సామాజిక హాని నుంచి అత్యంత తీవ్రమైన ప్రమాదాల వరకు అన్ని నష్టాలను ఇది అన్వేషిస్తుందని రిషి సునాక్ వెల్లడించారు.

Telugu Aisafety, America, Bletchley Park, China, Tech Summit, Pm Rishi Sunak-Tel

ఏఐ కంపెనీలు, రాజకీయ నాయకులు, నిపుణులను నవంబర్ 1, 2 తేదీల్లో బ్లెచ్లీ పార్క్‌( Bletchley Park )లో ఒకే వేదికపైకి తీసుకురానుంది బ్రిటన్.తద్వారా సురక్షిత అభివృద్ధిపై అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని పెంపొందించే లక్ష్యాన్ని పెట్టుకుంది.అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్‌ల నుంచి ఎదురువుతున్న పోటీ నేపథ్యంలో ఏఐ సేఫ్టీ విధానాల్లో .బ్రిటన్ గ్లోబల్ లీడర్‌గా వుండాలని రిషి సునాక్ ఆకాంక్షిస్తున్నారు.త్వరలో జరగనున్న సమావేశంలో దాదాపు 100 మంది నిపుణులు పాల్గొననున్నారు.

ఏఐ అనూహ్య పురోగతి, దానిపై నియంత్రణ సహా అన్ని విషయాలను ఈ సందర్భంగా చర్చించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube