బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న డబ్బింగ్ సినిమాలు ఇవే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలకు సైతం అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న డబ్బింగ్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి.

 Tv Top Rating Dubbing Movies Kantara Kanchana 2 Robo Kabali Bichhagadu Details,-TeluguStop.com

అయితే కొన్ని డబ్బింగ్ సినిమాలు థియేటర్లలో ఘన విజయం సాధించడంతో పాటు బుల్లితెరపై కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

కాంతార మూవీ తాజాగా ప్రముఖ ఛానల్ లో ప్రసారమై ఏకంగా 12.35 రేటింగ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.కాంచన2 సినిమా కూడా బుల్లితెరపై మంచి రేటింగ్ ను అందుకుంది.లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 13.1 రేటింగ్ ను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.రజనీ నటించిన కబాలి మూవీ బుల్లితెరపై ఏకంగా 14.52 రేటింగ్ ను సొంతం చేసుకుని అప్పట్లో వార్తల్లో నిలిచింది.

Telugu Bichhagadu, Kabali, Kanchana, Kantara, Kgf, Love, Rajnikanth, Robo, Top T

విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఏకంగా 18.78 రేటింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు 19.04 రేటింగ్ వచ్చింది.డబ్బింగ్ సినిమాలు సైతం స్ట్రెయిట్ సినిమాలను మించి రేటింగ్ లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాయనే సంగతి తెలిసిందే.

Telugu Bichhagadu, Kabali, Kanchana, Kantara, Kgf, Love, Rajnikanth, Robo, Top T

మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను తెలుగులో డబ్ చేయడానికి లేదా రీమేక్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.డబ్బింగ్ సినిమాలైన కేజీఎఫ్2, కాంతార, లవ్ టుడే సక్సెస్ తో డబ్బింగ్ సినిమాలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

డబ్బింగ్ సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube