యుక్త వయసు స్టార్ట్ అయినప్పటి నుంచి స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో మొటిమల సమస్య ఫేస్ చేసే ఉంటారు.అయితే కొందరికి మొటిమలు చెంపలపై వస్త .
కొందరికి నుదిటపై, ఇంకొందరికి గడ్డంపై వస్తుంటాయి.అలాగే కొందరికి వీపుపై సైతం మొటిమలు వస్తుంటాయి.
ఈ వీపుపై వచ్చే మొటిమలు అంత త్వరగా పోవు.మరియు ఇవి నొప్పితో పాటు తీవ్ర అసౌకర్యానికి గురిస్తాయి.
అయితే సరైన పద్ధతిలో కొన్ని హోమ్ మేడ్ చిట్కాలను పాటిస్తే సులభంగా వీపుపై ఏర్పడిన మొటిమలను నివారించుకోవచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పుదీనా పేస్ట్, అర స్పూన్ ఆరెంజ్ జ్యూస్, అర స్పూన్ లెమెన్ జ్యూస్, చిటికెడు పసుపు వేసుకుని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి ఇరవై నిమిషాల అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చలు కూడా పరార్ అవుతాయి.

అలాగే కొన్ని క్యారెట్ ముక్కలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి రసంలో తీసుకోవాలి.ఇప్పుడు రెండు స్పూన్ల క్యారెట్ రసానికి ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి మొటిమలు ఉన్న చోట పూయాలి.బాగా డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్‌తో వీపును క్లీన్ చేసుకోవాలి.
రెగ్యులర్‌గా ఇలా చేసినా వేధిస్తున్న మొటిమలు మటుమాయం అవుతాయి.
ఇక ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆలు గడ్డ పేస్ట్, అర స్పూన్ పెరుగు మరియు చిటికెడు సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.







