Turmeric Farming : పసుపు పంట నాణ్యమైన అధిక దిగుబడి కోసం వాడాల్సిన పోషక ఎరువులు ఇవే..!

పసుపు( Turmeric )ను ఆహార వంటలలో, వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.

 Turmeric Farming Tips And Techniques-TeluguStop.com

పసుపు పంట వేసే నేలను లోతుగా దున్నుకుంటే నేల వదులుగా మారుతుంది.దీంతో పసుపు గడ్డ ఊరడానికి చాలా అనువుగా ఉంటుంది.

పసుపు దుంపలను విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే.నేల నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించవు.ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ ను కలిపి ఆ ద్రావణంలో పసుపు దుంపలను ఒక 30 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత పొలంలో విత్తుకోవాలి.

Telugu Agriculture, Tips Techniques, Pasupu, Turmeric, Turmerictips, Weeds-Lates

పసుపు పంటలో నాణ్యమైన అధిక దిగుబడి పొందాలంటే పోషక ఎరువులే కీలక పాత్ర పోషిస్తాయి.ఎక్కువగా సేంద్రియ ఎరువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.వేసవికాలంలో ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు చేసి దుక్కి చేసుకోవాలి.ఒకవేళ పశువుల ఎరువు వేయకపోతే చివరి దుక్కిలో ఒక ఎకరానికి 200 కిలోల వేప పిండి మరియు కానుగ పిండి వేసుకోవాలి.

లేదంటే 200 కిలోల సూపర్ ఫాస్పేట్( Phosphate ) మరియు ఆముదం పిండి కలిపి వేసుకోవాలి.వీటితో పాటు జింక్ సల్ఫేట్ వేసుకోవాలి.

Telugu Agriculture, Tips Techniques, Pasupu, Turmeric, Turmerictips, Weeds-Lates

పసుపు పంట( Turmeric Field ) 35 రోజుల దశకు చేరుకున్నాక, ఒక ఎకరానికి 50 కిలోల యూరియా 200 కిలోల వేప పిండి కలుపుకొని పొలంలో వేసుకోవాలి.కలుపు మొక్కలు( Weed ) పెరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే చీడపీడల సమస్య చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.పసుపు పంట వెతిన మరుసటి రోజు ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల అట్రజిన్ ను కలిపి నేలపై పిచికారి చేయాలి.పంట విత్తిన 8 రోజులలోపు పండ్ల గోరుతో పైపాటు తిప్పాలి.

ఇక పొలంలో ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తే ఆశించిన స్థాయిలో మంచి పసుపు పంట దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube