అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ .మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) కోర్టుల్లో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
న్యూయార్క్ సివిలి ఫ్రాడ్ కేసుకు( Newyork Civil Fraud Case ) సంబంధించి ఆయనపై 354,868, 768 డాలర్ల జరిమానాతో పాటు వడ్డీని చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.న్యూయార్క్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ధర్ ఎంగోరాన్( Justice Arthur Engoron ) వెలువరించిన తీర్పుపై ట్రంప్ మద్ధతుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తీర్పు అన్యాయమంటూ ట్రంప్‌కు తామే నిధులు సమకూరుస్తామంటూ రంగంలోకి దిగారు.దాదాపు 355 మిలియన్ డాలర్ల నిధుల సేకరణే లక్ష్యంగా ‘‘ GoFundMe ’’ క్యాంపెయినింగ్ ప్రారంభించారు.

#StandWithTrumpకు ఇప్పటి వరకు 1,93,819 డాలర్ల విరాళాలు వచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.జస్టిస్ ఎంగోరాన్ నిర్ణయాన్ని అనుసరించి న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్( New York Attorney General Letitia James ) ట్రంప్‌పై కోర్టులో విరుచుకుపడ్డారు.ఆయన అవినీతిపరుడని దుయ్యబట్టారు.మరోవైపు.నిధుల సమీకరణను రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారు, ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన గ్రాంట్ కార్డోన్ భార్య ఎలెనా కార్డోనో( Elena Cardone ) ఏర్పాటు చేశారు.భారీ నిధుల సేకరణ చుట్టూ వివాదం ఉన్నప్పటికీ .క్యాంపెయినింగ్ ఏర్పాటు చేసిన కొద్దిగంటలకే విరాళాల ప్రవాహం కనిపించింది.

కాగా.న్యూయార్క్ సివిల్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి జరిమానాతో పాటు ట్రంప్‌పై మూడేళ్ల జరిమానా కూడా విధించారు న్యాయమూర్తి.ఆయన ఏ వ్యాపార సంస్థకు డైరెక్టర్‌గా గానీ, ఉన్నతాధికారిగా కానీ వ్యవహరించకూడదని జస్టిస్ ఆర్ధర్ ఎంగోరన్ ఆదేశించారు.
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకుల నుంచి ఎలాంటి రుణాలు పొందకూడదన్నారు.ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం జరిమానాతో సరిపెట్టడం చెప్పుకోగదగ్గ పరిణామం.లేదంటే ట్రంప్ కంపెనీలన్నింటినీ మూసివేయాల్సి వచ్చేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ట్రంప్ ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో 8.8 కోట్లు, మోసపూరితంగా ఆర్జించిన ఆదాయంపై 10 కోట్ల డాలర్ల వడ్డీని చెల్లించాల్సి వుంది.కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటూనే ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఇన్ని కేసులు వున్నప్పటికీ రిపబ్లికన్ మద్ధతుదారులలో ఆయనపై ఏమాత్రం నమ్మకం పోలేదు.







