టీఆర్ఎస్ కు షర్మిల ముప్పు ? చెమటలు పట్టిస్తున్నారుగా ? 

రాజకీయ పార్టీ పెట్టి మెల్లిగా తెలంగాణలో అధికారం సాధించే దిశగా వైస్ షర్మిల వేగం పెంచారు.షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు.

 Ys Sharmila, Jagan, Kcr, Trs, Telangana, Ys Rajashekarareddy, Bjp, Congress Part-TeluguStop.com

క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుని తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఏప్రిల్ 9వ తేదీన కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు షర్మిల ప్రకటించారు.

ఇవన్నీ ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఆమె పార్టీ స్థాపించడం వలన ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది లెక్కలు వేసుకుంటున్నారు.

ముఖ్యంగా షర్మిల పార్టీ ఏర్పాటుతో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ బాగా కంగారు పడుతోంది.దీనికి తోడు పదే పదే తమను టార్గెట్ చేసుకుంటూ షర్మిల విమర్శలు చేస్తూ ఉండడం టిఆర్ఎస్ లో మరింత భయాన్ని కలిగిస్తుంది.

అందుకే ముందుగానే షర్మిలను టార్గెట్ చేసుకునే పనిలో టిఆర్ఎస్ ఉంది.ఆమె ఏపీకి చెందిన వ్యక్తి అని, ఆమె తెలంగాణలో పార్టీ ఎలా పెడతారు అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.

దీనికి ధీటుగా షర్మిల సమాధానం చెప్పారు.

తన భర్తది తెలంగాణ అని, తన భర్త అనిల్ కుమార్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు అని, తాను తెలంగాణలో పుట్టి పెరిగానని, తాను స్థానికేతురాలు ఎందుకు అవుతాను అంటూ షర్మిల ప్రశ్నిస్తూ ఉండడంతో, టిఆర్ఎస్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది.

ఇప్పటికే టిఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలు, పదవులు దక్కని వారు, చాలామంది షర్మిల పార్టీ వైపు చూస్తూ ఉండడం, పెద్దఎత్తున నాయకులు, విద్యార్థి సంఘాలు ఆమెకు మద్దతు పలుకుతూ ఉండడం తో షర్మిల హవాను తగ్గించేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది.ఇటీవల ఖమ్మం లో వైస్ విగ్రహం ధ్వంసం అవ్వడం, దీనికి నిరసనగా వైఎస్ అభిమానులు, షర్మిల అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం, పంజాగుట్ట లో జరిగిన ఆందోళనలో స్వయంగా పాల్గొని టిఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం వంటి వ్యవహారాలు టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.

Telugu Congress, Jagan, Pulivendula, Telangana, Ys Rajashekara, Ys Sharmila-Telu

పూర్తిగా తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం వంటి వ్యవహారాలు గుబులు పుట్టిస్తున్నాయి.తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడింది అని సంబరపడుతున్న సమయంలో, బిజెపి బలం పెంచుకోవడం ఆ పార్టీకి కేంద్రంలో వ్యతిరేకత పెరుగుతున్నా, తమకు కలిసి వస్తుంది అనుకునే సరికి ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తూ, ప్రధాన ప్రత్యర్థిగా మారే అవకాశం ఉన్న నేపథ్యం ఇవన్నీ ఎక్కడలేని టెన్షన్ కలిగిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube