ఏపీ టీడీపీలో కొత్త లొల్లి నడుస్తోంది.ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన మహానాడు కార్యక్రమం టీడీపీకి కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది.
టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా దివ్యవాణికి పేరుంది.అయితే మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ ఆ పార్టీ మీద అలిగిన టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
అంతటితో ఆగకుండా దివ్యవాణి టీడీపీ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా ఆమె టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు.
ఆ పార్టీలో ఇన్నాళ్లూ ఏం జరిగిందో అన్నింటికీ ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అన్ని విషయాలనూ బయటపెడతానని దివ్యవాణి స్టేట్‌మెంట్ ఇచ్చారు.టీడీపీలో ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
తాను చెప్పే నిజాలు ప్రచురించే ధైర్యం ఎల్లోమీడియాకు ఉందా అని ప్రశ్నించారు.టీడీపీలో పనిచేసే స్వేచ్ఛ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా దివ్యవాణి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి.తాను ప్రజల్లోకి వెళ్లలేదని కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని.వాస్తవం ఏంటంటే తాను ప్రజల్లోకి వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వలేదని దివ్యవాణి విమర్శలు చేశారు.తనపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయా అంశాలపై దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

దీంతో దివ్యవాణి సవాళ్ళకు జవాబు ఎవరు చెబుతారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ దివ్యవాణి ఏం బయటపెట్టాలని భావిస్తున్నారో అంతుచిక్కని వ్యవహారంలా మారింది.ఆమె హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు.
చంద్రబాబునా లేదా లోకేష్‌నా లేదా అచ్చెన్నాయుడినా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.మొత్తానికి టీడీపీ లోగుట్టు ఏంటో.
అక్కడ ఏం జరుగుతోందన్న వ్యవహారం ఆసక్తికరంగా మారింది.







