మణిపూర్( Manipur ) అల్లర్ల విషయంలో మోడి సర్కార్( Modi Sarkar ) పై విపక్ష కూటమి పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.ఈ తీర్మానం పై లోక్ సభలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.
మోడి సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు విపక్ష పార్టీలు అస్త్రశాస్త్రాలను సందిస్తున్నాయి.ఇకపోతే అనర్హత వేటు ఎత్తివేయడంతో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తిరిగి లోక్ సభలో అడుగుపెట్టారు.
లోక్ సభలో మోడి సర్కార్ పై రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు, పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం భారతమాతను మర్డర్ చేసిందని మణిపూర్ అల్లర్లను మోడీ సమర్థించే యోచనలో ఉన్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి.దాంతో ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న బిజెపి నేతలు డిఫెన్స్ లో పడి టాపిక్ ను డైవర్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.రాహుల్ గాంధీ బయటకు వెళ్ళే క్రమంలో తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని బిజెపి ఎంపి స్మృతి ఇరానీ లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు.అయితే నిజంగానే రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడా అంటే అలాంటిదేమీ లేదనే సమాధానమే ఎక్కువగా వినిపించింది.
ఇకపోతే ఆ తరువాత లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన అందులో మణిపూర్ కు సంబంధించి పెద్దగా స్పందించింది లేదు.దీంతో మరోసారి మీడియా సమావేశంలో మోడీ పై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ.లోక్ సభలో రెండు గంటలు లోక్ సభలో రెండు గంటలు ప్రసంగించిన మోడీ కేవలం రెండు నిముషాలు మాత్రమే మణిపూర్ గురించి మాట్లాడారని, అసలు మణిపూర్ అంశాన్నే మోడీ తమాషా చేశారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.మణిపూర్ అల్లర్ల ను ఇండియన్ ఆర్మీ రెండు రోజుల్లో అదుపు చేయగలదని కానీ మోడీ ఎందుకు అలా చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ చేస్తున్న ఈ విమర్శలు బిజెపిని గట్టిగానే దెబ్బ తీస్తున్నాయి.ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్నవ్యాఖ్యలు మోడీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపే విధంగా ఉన్నాయి.మొత్తానికి ముందు రోజుల్లో రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.