మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )కి రీఎంట్రీలో భారీ షాకిచ్చిన సినిమా ఏదనే ప్రశ్నకు ఆచార్య సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.
దర్శకుడిగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన కొరటాల శివ ఇమేజ్ ను ఈ సినిమా డ్యామేజ్ చేసింది.
భోళా శంకర్ మూవీ ఆచార్య మూవీ( Acharya )ని మించిన డిజాస్టర్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఆచార్య మూవీ స్ట్రెయిట్ సినిమా కాగా ఈ సినిమాలో కనీసం కథ, కథనం ఒకింత కొత్తగా ఉంటాయి.అయితే భోళా శంకర్ సినిమాలో మాత్రం ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో ముందే ఊహించవచ్చు.
ఈ సినిమాలోని ఇంటర్వల్ ట్విస్ట్ మాత్రమే అంతోఇంతో ఆకట్టుకునేలా ఉంది.సినిమాలో ఉన్న రెండు మూడు ట్విస్టులు మాత్రం బాగున్నాయి.
అయితే సినిమాలో ప్రేక్షకుల సహనానికి పెట్టే సీన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.చిరంజీవి అద్భుతంగా నటించినా సినిమాకు ఎలా ఓకే చెప్పారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భోళా శంకర్ సినిమాకు 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు ఉండనున్నాయని సమాచారం.
భోళా శంకర్ మూవీ( Bhola Shankar Movie ) శాటిలైట్ హక్కులు సైతం అమ్ముడవలేదని తెలుస్తోంది.ఏజెంట్ సినిమాతో షాక్ తిన్న అనిల్ సుంకరకు ఈ సినిమా ఆ సినిమాను మించి నష్టాలను మిగుల్చుతోంది.అనిల్ సుంకర( Anil Sunkara )కు తర్వాత సినిమాలు అయినా లాభాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది.
చిరంజీవి ఈ సినిమా నష్టాలను కొంతమేర అయినా భరిస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.భోళా శంకర్ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.