త్రివిక్రమ్ పేరు కనిపించక పోవడానికి కారణం అదేనా..?

తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించినా సినిమాసినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో విజయాలతో జోరుమీదున్న త్రివిక్రమ్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

 Trivikram Hands In Ayyappanum Koshiu,m Movie Remake Or Not, 10 Crores Remunerati-TeluguStop.com

ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులు త్రివిక్రమ్ పూర్తి చేశారని తెలుస్తోంది.

అయితే పవన్, రానా హీరోలుగా తెరకెక్కుతోన్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ పనులు మొదలైనప్పటి నుంచి త్రివిక్రమ్ ఈ సినిమా కథ, కథనంలో మార్పులు చేశారని ఈ సినిమాకు మాటలు రాస్తున్నారని తివిక్రమ్ కు మాటలు, కథనంలో మార్పులకు పది కోట్ల రూపాయలు పారితోషికం రూపంలో దక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.

అయితే నిన్న ఈ సినిమా పోస్టర్ పై త్రివిక్రమ్ పేరు కనిపించలేదు.

Telugu Pawan Kalyan-Movie

దీంతో పవన్ సినిమాకు త్రివిక్రమ్ పని చేస్తున్నారా.? లేదా.? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ పని చేస్తున్నారని కొన్ని కారణాల త్రివిక్రమ్ తన పేరు పోస్టర్ పై వేయించుకోవడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది.పవన్ సినిమాలకు త్రివిక్రమ్ సహాయం చేస్తుండటంపై నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయని ఆ కారణం వల్లే త్రివిక్రమ్ పేరు వేయించుకోలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే చిత్ర యూనిట్ స్పందిస్తే మాత్రమే త్రివిక్రమ్ ఈ సినిమాకు పని చేస్తున్నారో లేదో తెలిసే అవకాశం ఉంది.మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అయ్యారే ఫేమ్ సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.సాగర్ చంద్ర తీసిన సినిమాలు భారీ హిట్లు కాకపోయినా అయ్యప్పనుమ్ కోషియమ్ కథను సాగర్ చంద్ర తెలుగు నేటివిటీకు తగినట్లుగా మార్చడంతో ఆయనకు ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube