కృష్ణా జిల్లా మచిలీపట్నం – తాళ్లపాలెం బీచ్ లో విషాదం నెలకొంది.సరదాగా ఈత కొట్టడానికి ఐదుగురు స్టూడెంట్స్ కలిసి వెళ్లారు.
ఈ క్రమంలోనే ఒక్కసారిగా రాకసి అలలు రావడంతో విద్యార్థులు కొట్టుకుపోయారు.వెంటనే మెరైన్ పోలీసులు నలుగురిని రక్షించగా మరొక విద్యార్థి అలల తాకిడికి బలయ్యారు.
కొంత సమయం తరువాత అఖిల్ అనే విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి మృత్యువాత పడటంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.