కార్పొరేట్ ప్రపంచం రాజ్యమేలుతోంది.వీరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ వారి సామ్రాజ్యం విస్తరిస్తుంది అనడంలో సందేహం లేదు.
నేడు ఈ కార్పొరేట్ దిగ్గజాలు దేశ స్థితిగతులను నిర్దారిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో.ఇక వ్యాపారం అంటే… కొనుగోళ్లు, విలీనాలు అనేవి సర్వసాధారణం.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇలాంటి వార్తలు పెద్దగా మనకు వినిపించకపోయినప్పటికీ ఈ ఏడాది మాత్రం ప్రధాన కంపెనీల్లో విలీనాలు, కొనుగోళ్లు అనేవి ప్రధానంగా చోటుచేసుకున్నాయి అని చెప్పుకోవాలి.
ఈ క్రమంలో ముఖ్యంగా ఎయిరిండియా, ట్విటర్, ఎన్డీటీవీ వంటివి వార్తల్లో నిలిచాయి.అలా ఈ ఏడాది ప్రముఖంగా వార్తల్లో నిలిచిన కొనుగోళ్లు, విలీనాలేంటో ఇపుడు చూద్దాం… అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా అమ్మకం అనేది చాలా ఏళ్లుగా నానుతూ రాగా ఎట్టకేలకు ఈ సంవత్సరం టాటా గ్రూప్ సొంతం చేసుకుంది.అవును… 1932 టాటా స్థాపించిన టాటా ఎయిర్లైన్స్ తర్వాతి కాలంలో ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది.అనంతరం ఎయిరిండియాగా మారిన సంగతి విదితమే.
ముఖ్యంగా ఈ ఏడాది కొనుగోళ్ల విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది ట్విటర్.మొదట దీనిని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని చెప్పిన మస్క్ ఆ తర్వాత కొనబోనని చెప్పడం, అదికాస్త మళ్లీ కోర్టుదాకా వెళ్లడం అనేది జరిగింది.నాటకీయంగా సాగిన అనేక పరిణామాల తర్వాత చివరికి మళ్లీ మస్కే ట్విటర్ ని కొనుగోలు చేసాడు.
ఇక ఎన్డీటీవీ వ్యవహారం తెలిసినదే.ఒక మీడియా సంస్థను దేశంలో అత్యంత సంపన్నుడైన ఓ వ్యక్తి చేజిక్కించుకోవడం పెద్ద విషయమేమీ కాదు.
ఇలాంటి పరిణామాలు అనేకం ఈ సంవత్సరం చోటుచేసుకున్నాయి.