టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు కేవలం 5 మంది బౌలర్లు మాత్రమే 600 వికెట్ల మార్క్ ని దాటగలిగారు.టీ20, వన్డే ఫార్మాట్లలో వికెట్లు తీయడం ఒక ఎత్తు అయితే టెస్టు ఫార్మాట్లో వికెట్లు తీయడం మరో ఎత్తు.అందుకే టెస్ట్ క్రికెట్లో ఉండే రికార్డులను బద్దలు కొట్టడం సామాన్యమైన విషయం కాదు.అయితే టెస్ట్ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ జట్లకు చెందిన బౌలర్లు ఉన్నారు.ఆ బౌలర్ల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ముత్తయ్య మురళీధరన్:
శ్రీలంకకు చెందిన స్టార్ స్పిన్నర్ మురళీధరన్( Muttiah Muralitharan ) టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా సరికొత్త రికార్డు సృష్టించి ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.మురళీధరన్ 133 టెస్టు మ్యాచ్లు ఆడి ఏకంగా 800 వికెట్లు తీశాడు.ఈ రికార్డు ను బ్రేక్ చేయడం అసాధ్యమే.
షేన్ వార్న్:
ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్( Shane Warne ) టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.షేన్ వార్న్ 145 టెస్టు మ్యాచులు ఆడి 708 వికెట్లు తీశాడు.
జేమ్స్ అండర్సన్:
ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్( James Anderson ) టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడవ ఆటగాడిగా నిలిచాడు.జేమ్స్ అండర్సన్ 182 టెస్ట్ మ్యాచ్లు ఆడి 688 వికెట్లు తీశాడు.
అనిల్ కుంబ్లే:
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా సరికొత్త రికార్డు సృష్టించిన అనిల్ కుంబ్లే( Anil Kumble ) ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నాడు.అనిల్ కుంబ్లే 132 టెస్ట్ మ్యాచ్లు ఆడి 619 వికెట్లు తీశాడు.
స్టువర్ట్ బ్రాడ్:
యాషెస్ సిరీస్ 2023 మూడో టెస్ట్ ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్( Stuart Broad ) తాజాగా 600వ వికెట్ తీసి ఈ జాబితాలో చేరి ఐదవ స్థానంలో నిలిచాడు.స్టువర్ట్ బ్రాడ్ ఇప్పటివరకు 166 టెస్ట్ మ్యాచ్లు ఆడి 600 వికెట్లు తీశాడు.ఈ అనంత సాధించిన రెండో ఇంగ్లాండ్ బౌలర్ గా నిలిచాడు.