Rajamouli : అందరి టార్గెట్ రాజమౌళి.. ఆయుధంగా మారిన ప్రభాస్

ఇంతకు ముందు టాలీవుడ్ లో ఎవరు నెంబర్ 1 డైరెక్టర్ అని అడిగితే చాలా మంది క్లారిటీ లేని సమాధానం ఇచ్చేవారు.కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు.

 Tollywood Directors Target Rajamouli-TeluguStop.com

బాహుబలి, ఆర్ఆర్ఆర్ ( Baahubali, RRR) సినిమాలు తర్వాత ప్రతి ఒక్కరి నోటా రాజమౌళి( rajamouli )పేరు మాత్రమే వస్తుంది.మరి రాజమౌళి నెంబర్ వన్ గా ఉన్నాడు అంటే మిగతా వారంతా రాజమౌళిని ఈ టార్గెట్ చేయాల్సిందే కదా.అందుకే టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఇప్పుడు రాజమౌళిని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు.అందుకు ఆయుధంగా ప్రభాస్ (Prabhas)మాత్రమే వారందరికీ ఏకైక దిక్కుగా మారాడు.మరి అలా రాజమౌళి స్థానానికి ఎసరు పెడుతున్న ఆ టాలీవుడ్ దర్శకులు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

Telugu Salaar, Adipurush, Animal, Baahubali, Kalki, Nag Ashwin, Prabhas, Prashan

ఇంతకు ముందు సాహో మరియు రాధే శ్యామ్, ఆది పురుష్ (Saaho , Radhe Shyam, Adipurush )వంట చిత్రాలతో బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు వచ్చినా కూడా అవేమి అతడి కెరీర్ కి కానీ ఆ దర్శకుల కెరియర్ కానీ ఉపయోగపడలేదు.కానీ ఇక పై రాబోయే సినిమాలు అలా కాదు.ఆల్రెడీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఆ బ్రాండ్ కి తగ్గ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది దర్శకులు.దాంట్లో అందరి కన్నా ముందుగా చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్(Prashanth Neel).

ఇప్పటికే సలార్(Salaar) సినిమాతో 600 కోట్లు వసూలు వసూళ్లు చేసి సలార్ రెండవ భాగంతో 1000 కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నాడు ప్రశాంత్ నీల్.నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ కల్కి(Nag Ashwin ,Kalki ) సినిమాతో తన రూటే సపరేటు అని నిరూపించాలనుకుంటున్నాడు.ఖచ్చితంగా కల్కి లాంటి చిత్రం విజయం సాధిస్తే 1000 కోట్ల టార్గెట్ పెద్ద విషయం ఏమి కాదు.1500 కోట్ల రూపాయలకు మీదే కలెక్షన్స్ దక్కించుకోంటుంది అని కొంత మంది అంచనా వేస్తున్నారు

Telugu Salaar, Adipurush, Animal, Baahubali, Kalki, Nag Ashwin, Prabhas, Prashan

ఇక ఇప్పటికే ఆనిమల్ సినిమాతో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా 800 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి స్పిరిట్ అనే సినిమాతో ప్రభాస్ హీరోగా 1000 కోట్ల మార్క్ దాటేసి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవాలని తహతలాడుతున్నాడు.మరి ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ ఈ ముగ్గురు దర్శకులు ప్రభాస్ అనే అస్రం తోనే ఈ స్థాయి మార్పును దాటగలరు అని నమ్ముతున్నారు.మరి ఆ మార్కు అందుకుంటారా లేదా అనేది ఈ సినిమాలు విడుదలైతే గాని క్లారిటీ రాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube