మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెల.. ఖుషి వచ్చే వరకు ఇంతే!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి లోపించింది.గత వారం వచ్చిన భోళా శంకర్‌, ( Bholaa Shankar )మొన్న వచ్చిన సినిమాలు ఏవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.

 Tollywood Box Office Report , Kushi, Bholaa Shankar Movie, Jailer Movie, Bollyw-TeluguStop.com

తమిళ్‌ మూవీ జైలర్ కాస్త పర్వాలేదు అనిపించింది.అయితే ఎక్కువగా జైలర్ సినిమాకు భారీ వసూళ్లు రావడం లేదు.

భారీ వసూళ్లు సాధించిన సినిమాలు వచ్చి చాలా కాలం అయింది.మళ్లీ బాక్సాఫీస్ వద్ద సందడి ఎప్పుడెప్పుడు అంటూ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

స్టార్‌ హీరోల సినిమాలు ముందు ముందు వరుసగా రాబోతున్నాయి.ఈ వారంలో వరుణ్ తేజ్ సినిమా రాబోతుంది.

Telugu Bhola Shankar, Bollywood, Jailer, Kushi, Samantha, Tollywood-Movie

ఆ సినిమా కు ఏవో కారణాల వల్ల భారీ ప్రమోషన్స్ చేయడం లేదు.కనుక ఎంత వరకు ఆ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది అనేది క్లారిటీ లేదు.ఇప్పుడు అందరి దృష్టి అంతా కూడా విజయ్‌ దేవరకొండ నటించిన ఖుషి ( Kushi )సినిమాపైనే ఉంది.సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఖుషి సినిమా లో విజయ్ దేవరకొండ కు జోడీగా సమంత నటించింది.

అంతే కాకుండా విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న శివ నిర్వాన దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది.పైగా సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని.


Telugu Bhola Shankar, Bollywood, Jailer, Kushi, Samantha, Tollywood-Movie

ఆమె కథ అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అందుకే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొనడం ఖుషి సినిమా వచ్చిన తర్వాతే అంటూ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )అభిమానులతో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.మరి ఖుషి సినిమా ఆ ఆశలను అన్నీ నెరవేర్చుతుందా.

అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.ఖుషి సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.

ఇటీవల జరిగిన మ్యూజిక్ షో అలరించింది.ఈ సినిమా కు పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube