తెలుగు ప్రేక్షకులకు దివంగత హీరో ఉదయ్ కిరణ్( Uday Kiran ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉదయ్ కిరణ్ చనిపోయి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఆయన మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఉదయ్ కిరణ్. అయితే ఆయన నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి సుధ( Actress Sudha ) ఉదయ్ కిరణ్ మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
దసరా నవరాత్రుల సందర్భంగా( Dasara Navaratri ) ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక స్పెషల్ షోకి ఈమె అతిథిగా వచ్చారు.ఈ షోలోనే ఉదయ్ కిరణ్ ఫోటో పట్టుకొని కన్నీరు మున్నీరు అయ్యారు సుధ.ఉదయ్ కిరణ్ నటించిన పలు సినిమాల్లో సుధ కూడా నటించారు.కొన్ని సినిమాల్లో ఉదయ్ కిరణ్ కి తల్లిగా కూడా కనిపించారు.ఇక అందరికి చాలా దగ్గరయ్యే ఉదయ్ కిరణ్ నటి సుధకి కూడా అంతే దగ్గర అయ్యాడు.
ఈ షోలో ఒక సందర్భంలో ఉదయ్ కిరణ్ ని తలుచుకుంటూ.ఒకవేళ వాడు నా కడుపున పుట్టుంటే ఇంకా బ్రతికి ఉండేవాడేమో అంటూ కన్నీరు పెట్టుకున్నారు సుధ.
ఆమెతో పాటు షోలో వారు కూడా ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.మొన్నటికి మొన్న ఉదయ్ కిరణ్ విషయం గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్( Murali Mohan ) మాట్లాడుతూ.మహేష్ బాబు నటించిన అతడు సినిమా( Athadu Movie ) ఉదయ్ కిరణ్ చేయాల్సిందట.
మురళి మోహన్ నిర్మించిన ఈ సినిమా కథని త్రివిక్రమ్ ముందుగా ఉదయ్ కిరణ్ కే వినిపించాడట.తను కూడా ఒకే చెప్పాడు, ఉదయ్ తెరకెక్కించడానికి మేకర్స్ కూడా సిద్ధమయ్యారు.
అయితే ఉదయ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ మూవీ మిస్ అయ్యింది.